ఐదేళ్ల బాలికను రేప్ చేసి, ఆపై ఆత్మహత్య చేసుకున్న వృద్ధుడు..
ఓ వృద్ధుడు ఐదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బాధితురాలు తల్లికి చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వెతుకుతున్నారనే విషయం తెలియడంతో అతడు ఇంట్లో నుంచి వెళ్లిపోయి బలవన్మరణానికి ఒడిగట్టాడు.

ప్రస్తుతం సమాజంలో మహిళలకు, చిన్నారులకు ఎక్కడా రక్షణ లేకుండా పోయింది. ఏదో సినిమాలో అన్నట్లు అమ్మ కడుపులో తప్ప మహిళలకు బయట సమాజంలో ఎక్కడా రక్షణ లభించడం లేదు. ఇంట్లో, స్కూళ్లో, ఆఫీస్ లో ఎక్కడ ఆమెకు రక్షణ దొరకడం లేదు. ఆమెకు లైంగిక వేధింపులు సాధారణమైపోయాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ లోనూ ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది.
విషాదం.. అమెరికాలో అనుమానాస్పద స్థితిలో మరణించిన భారత సంతతి కుటుంబం..
ఓ ఐదేళ్ల బాలికపై వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. తినుబండారాలు కొనిస్తానని చెప్పి, తన వెంట తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు. అనంతరం అతడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన యూపీలోని బరేలి జిల్లాలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బరేలీలోని ఫరీద్ పుర్ పరిధిలోని ఓ గ్రామంలో ఓ ఐదేళ్ల చిన్నారి తన తల్లిదండ్రులతో కలిసి జీవిస్తోంది. ఆమె ఇంటికి సమీపంలోనే ఓ 60 ఏళ్ల వృద్ధుడు షేర్ మహమ్మద్ నివసిస్తోంది.
విషాదం.. అమెరికాలో అనుమానాస్పద స్థితిలో మరణించిన భారత సంతతి కుటుంబం..
ఎప్పటిలాగే గురువారం ఆ బాలిక తన ఇంటి సమీపంలో ఆడుకుంటోంది. అదే సమయంలో షేర్ మహమ్మద్ అక్కడికి వచ్చాడు. దుకాణంలో తిను బండారాలు కొనిస్తానని బాలికకు ఆశచూపాడు. పొరుగింట్లో నివసించే తాతయ్యే కదా అని ఆ బాలిక నమ్మకంతో అతడి వెంట వెళ్లింది. దీనిని ఆసరాగా తీసుకొని వృద్ధుడు ఆ చిన్నారిపై దారుణానికి పాల్పడ్డాడు. లైంగిక దాడికి ఒడిగట్టాడు.
సెక్రటేరియేట్ లో సీతక్కకు చేదు అనుభవం.. గేటు నుంచి నడుచుకుంటూనే లోపలికి వెళ్లిన ఎమ్మెల్యే..
కొంత సమయం తరువాత బాలిక ఇంటికి వచ్చింది. తనపై జరిగిన దారుణాన్ని తల్లికి వివరించింది. దీంతో బాధితురాలి తల్లి పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడి కోసం వెతకడం ప్రారంభించారు. ఈ విషయం షేర్ మహమ్మద్ కు తెలిసింది. దీంతో ఇంట్లో నుంచి అతడు పారిపోయాడు. మరుసటి రోజు ఓ ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్నాడు.