Asianet News TeluguAsianet News Telugu

దేశ రాజధానిలో కలకలం.. ఢిల్లీ కోర్టులో పేలుడు

దేశ రాజధాని ఢిల్లీలోని కోర్లులో పేలుడు సంభవించడంతో ఒక్క సారిగా కలకలం రేగింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

An explosion in the Delhi High Court
Author
Hyderabad, First Published Dec 9, 2021, 4:34 PM IST

దేశరాజధానిలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఢిల్లీ కోర్టులో బుధవారం పేలుడు సంభవించింది. అత్యంత భారీ భ‌ద్ర‌త ఉంటే హైకోర్టులో ఈ పేలుడు జ‌ర‌గ‌డంతో అంతా ఉలిక్కిప‌డ్డారు. కోర్టు ప‌రిసరాల్లో ఉండే అంద‌రూ భ‌యంలో ప‌రిగెత్తారు. ఏం జ‌ర‌గిందో ? మ‌ళ్లీ ఏం జ‌ర‌గబోతోందో తెలియ‌క‌ ఆందోళ‌న‌కు గుర‌య్యారు. రంగంలోకి దిగిన పోలీసులు అసలు ఏం జ‌రిగిందో తేల్చేశారు. భ‌య‌ప‌డాల్సింది ఏం లేద‌ని తెలియజేశారు. 

రీ ఫండ్ కు ట్రై చేస్తే.. రూ.44వేలు కాజేశారు.. ఫుడ్ డెలివరీ యాప్ మోసం..

పేలుడుకు కార‌ణం ఏంటి ? 
బుధ‌వారం ఉద‌యం కోర్టు యథావిథిగా త‌న కార్య‌కలాపాలు ప్రారంభించింది. లాయ‌ర్లు, కేసుల విష‌యంలో కోర్టుకు వ‌చ్చే సాధార‌ణ జ‌నంతో పాటు న్యాయ‌మూర్తులు అంద‌రూ ఎవ‌రి ప‌నుల్లో వారు త‌ల‌మున‌క‌ల‌య్యారు. అయితే ఉద‌యం ప‌దిన్న‌ర గంట‌ల ప్రాంతంలో పేలుడు శ‌బ్దం వినిపించ‌డంలో అంద‌రూ భ‌యాందోళ‌కు గురయ్యారు. ప్రాణ‌భ‌యంతో అంద‌రూ ప‌రుగులు తీశారు.  దీంతో వెంట‌నే పోలీసులు రంగంలోకి దిగారు. ఎవ‌రూ భ‌య‌ప‌డాల్సిన ప‌ని లేద‌ని పేలింది బాంబు కాద‌ని, కేవ‌లం ల్యాప్‌టాప్ బ్యాట‌రీ అని చెప్పారు. దీంతో అంద‌రూ ఊపిరిపీల్చుకున్నారు. ’’ మేం మొదట చిన్నపాటి తక్కువ తీవ్రత కలిగిన బాంబు అనుకొని భావించాం. కానీ కోర్టులోని రోహిణి కోర్టు రూమ్ లోని 102 గదిలో ల్యాప్ టాప్ పేలింది. 10.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.  ఘటనా స్థలాన్ని ఫోరెన్సిక్, ఎన్ఎస్జీ, బృందాలు ప‌రిశీలిస్తున్నాయి’’ అని పోలీసులు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌ను ద‌ర్యాప్తు చేసేందుకు ఢిల్లీ పోలీసులు ప్ర‌త్యేక బృందం ఏర్పాటు చేశారు. ఆ బృందం పూర్తి స్థాయిలో ఘ‌ట‌న‌కు గ‌ల కార‌ణాల‌ను శాస్త్రీయంగా ద‌ర్యాప్తు జ‌ర‌ప‌నుంది.  ఇప్ప‌టికే ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌లో ఎవ‌రికి ఎలాంటి గాయాలుకాలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కొంత స‌మ‌యం త‌రువాత కోర్టు క‌ల‌పాలు య‌థావిథిగా కొన‌సాగాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios