ప్రధాని నివాసంలో కీలక సమావేశం కొనసాగుతోంది. ప్రధాని మోడీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు సుదీర్ఘ మంతనాలు జరుపుతున్నారు. కీలకమైన భేటీ జరుగుతుండటం, కేంద్ర కేబినెట్ విస్తరణపైన ఊహాగానాలు రేకెత్తిస్తున్నాయి. కొద్ది వారాల్లోనే కేంద్ర కేబినెట్‌లో మార్పులు- చేర్పులు జరగొచ్చని సమాచారం. 

కొందరి శాఖలు మారవచ్చని.. ఇంకొందరికి కేబినెట్‌ నుంచి ఉద్వాసన పలకవచ్చని ప్రచారం జరుగుతోంది. కొత్తవారికి కూడా అవకాశం ఇస్తారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలోనే కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ ఉంటుందని, కేంద్ర ప్రభుత్వంలోని విశ్వసనీయ వర్గాలు చెప్పినట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ కథనాల ప్రకారం.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్ని మంత్రిత్వశాఖల నుంచి వివరాలను సేకరించనున్నారు. మంత్రుల పనితీరు.. ఆయా రంగాలు సాధించిన అభివృధ్ధిని సమీక్షించనున్నారు. దీని ఆధారంగానే కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ చేపట్టవచ్చని తెలుస్తోంది.

Also Read:శరద్ పవార్ తో ప్రశాంత్ కిశోర్ భేటీ: మోడీకి ధీటైన అభ్యర్థికి వ్యూహరచన?

అంతేకాదు 2019లో రెండోసారి మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఇప్పటి వరకు మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ జరగలేదు. ఈ నేపథ్యంలో మంత్రివర్గంలో మార్పులు చేర్పులకు.. ఇదే సరైన సమయమని ప్రధాని మోడీతో పాటు బీజేపీ పెద్దలు యోచిస్తున్నారట.