న్యూఢిల్లీ:ఆప్‌కు ఆ పార్టీ  నేత అల్క లాంబా గుడ్‌బై చెప్పనున్నారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు. పార్టీకి గుడ్ బై చెప్పే సమయం ఆసన్నమైందని  ఆమె ప్రకటించారు.

వారం రోజుల క్రితం అల్క లాంబా  కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియాగాంధీతో భేటీ అయ్యారు. ఆమె ఆప్‌ను వీడి గతంలో తాను  పనిచేసిన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొనే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.ఈ తరుణంలో ఆప్ ను నేతలు వరుసగా వీడుతున్నారు.

 

ఆరేళ్లుగా తాను అనేక విషయాలను  నేర్చుకొన్నాను అని ఆమె ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. లాంబా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని సమాచారం.గత మంగళవారంనాడు లాంబా సోనియాగాంధీని కలిశారు. ఈ తరుణంలోనే ఆమె పార్టీ మారుతారనే ప్రచారం ఊపందుకొంది. పార్టీకి గుడ్ బై చెప్పే సమయం వచ్చిందని  లాంబా ట్విట్టర్ వేదికగా తేల్చి చెప్పారు.