'హలాల్' భోజనంపై ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం.. ఇకపై హిందువులు, సిక్కులకు ఆ మీల్స్ అందించబోమని ప్రకటన

టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా తమ విమానాల్లో అందించే భోజనం విషయంలో వివాదంలో చిక్కుకుంది. ఇకపై హిందువులు, సిక్కులకు 'హలాల్' సర్టిఫైడ్ భోజనం అందించబోమని ప్రకటించింది.

Air India Stops Serving Halal Certified Meals to Hindus and Sikhs Amid Controversy GVR

టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా సంచలన ప్రకటన చేసింది. తమ విమానాల్లో అందించే భోజనం విషయంలో వివాదంలో చిక్కుకుంది. ఇకపై హిందువులు, సిక్కులకు 'హలాల్' సర్టిఫైడ్ భోజనం అందించబోమని ప్రకటించింది.

జాతీయ మీడియా కథనాల సమాచారం ప్రకారం,  MOML (ముస్లిం భోజనం) ‘MOML’ స్టిక్కర్‌తో ముందస్తుగా బుక్ చేసుకున్న భోజనాన్ని ప్రత్యేక భోజనంగా (SPML) పరిగణించాలి. హలాల్ సర్టిఫికేట్ MOML భోజనానికి మాత్రమే అందిస్తారు. సౌదీలోని అన్ని భోజనాలు హలాల్‌గా ఉంటాయి. హజ్ విమానాలతో సహా జెడ్డా, దమ్మామ్, రియాద్, మదీనా సెక్టార్లలో హలాల్ సర్టిఫికేట్ ఉంటుంది. 

కాగా, ఎయిర్ ఇండియా మతం ఆధారంగా భోజనాన్ని లేబుల్ చేస్తోందని విరుదునగర్ కాంగ్రెస్ ఎంపీ మణికం ఠాగూర్ తప్పుపట్టారు. దీనిపై ఈ ఏడాది జూన్ 17న ఆందోళన వ్యక్తం చేశారు. ఎయిర్ ఇండియా వెబ్‌సైట్ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసిన ఠాగూర్... ‘హిందూ’ లేదా ‘ముస్లిం’ భోజనం అంటే ఏమిటి? అని ప్రశ్నించారు. దీనిపై పౌర విమానయాన మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘సంఘీలు’ ఎయిర్ ఇండియాను స్వాధీనం చేసుకున్నారా?’ అని ప్రశ్నించారు.

విమానాల్లో భోజనం విషయంలో తలెత్తిన వివాదంపై ఎయిరిండియా క్లారిటీ ఇచ్చింది. ఇకపై హిందువులు, సిక్కులకు 'హలాల్' సర్టిఫైడ్ భోజనం అందించబోమని తెలిపింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios