దేవుడు తనకు చెప్పాడని... తన ఆరోగ్యం కుదుటపడుతుందని చెప్పి.. ఓ వ్యక్తి రెండున్నరేళ్ల కుమార్తెను నీటిలోకి తోసి అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ సంఘటన అస్సాంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... అస్సాం రాష్ట్రం బక్సా జిల్లాకు చెందిన బీర్బల్ బోరో(45) అనే వ్యక్తి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు.

కాగా... శనివారం సాయంత్రం కూతురు హ్రిషిక ను  తనతోపాటు బయటకు తీసుకువెళ్లాడు. తర్వాత తిరిగి ఇంటికి ఒక్కడే చేరుకున్నాడు. కుమార్తె ఏమైందంటూ భార్య ప్రశ్నించగా... బోర్లా నదిలో తోసేసినట్లు చెప్పాడు. అతను చెప్పిన సమాధానికి కంగారుపడిన బీర్బల్ భార్య వెంటనే ఈ విషయాన్నిచుట్టుపక్కల వారికి తెలియజేసింది.  వాళ్లు కూడా వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిచగా... అసలు నిజం అంగీకరించాడు. తానే కుమార్తెను నదిలోకి తోసేసినట్లు చెప్పాడు. పోలీసులు వెంటనే నదిలో గాలించగా... చిన్నారి శవమై కనిపించింది. కుమార్తెను ఎందుకు చంపావని పోలీసులు అడిగిన ప్రశ్నకు అతను చెప్పిన సమాధానం అందరినీ విస్మయానికి గురిచేసింది.

తన ఆరోగ్యం కుదుటపడాలంటే.. కుమార్తెను చంపేయాలంటూ దేవుడు తనకు చెప్పాడని చెప్పడం విశేషం. కాగా... అతని మానసిక పరిస్థితి సరిగాలేదని పోలీసులు భావిస్తున్నారు. హత్యానేరం కింద అతనిని అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు.