పురిటి నొప్పులతో డెలివరీ కోసం వచ్చిన గర్భిణీకి  ఓ మేల్ నర్స్ పురుడు పోసి.. బిడ్డ ప్రాణాలు పోవడానికి కారణమైన సంఘటన తెలిసిందే. కాగా.. ఈ ఘటనలో మేల్ నర్స్ ని పోలీసులు అరెస్టు చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళితే... రాజస్థాన్ రాష్ట్రంలోని రామ్ ఘడ్  ప్రాంతానికి చెందిన ఓ గర్భిణి పురిటి నొప్పులతో బాధపడుతూ.. ప్రసవం కోసం రామ్ ఘడ్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో.. మేల్ నర్స్.. ఆమెకు పురుడు పోసాడు.. కడుపులో బిడ్డను బయటకు లాగే సమయంలో.. గట్టిగా లాగాడు. దీంతో.. బిడ్డ రెండు ముక్కలు అయ్యింది. తల మాత్రం మహిళ కడుపులోనే ఉండటం గమనార్హం.

శిశువు మొండెం భాగాన్ని ఆస్పత్రి మార్చురీకి తరలించాడు.ఈ విషయం ఎవరికీ చెప్పకుండా.. కండిషన్ సీరియస్ గా ఉందంటూ.. వేరే ఆస్పత్రికి తీసుకువెళ్లాలంటూ ఆమె కుటుంబసబ్యులకు సూచించాడు. ప్రైవేటు ఆస్పత్రికి ఆమెను తీసుకువెళ్లగా.. ఆమెకు ఆపరేషన్ చేసిన అక్కడి వైద్యులు కంగుతిన్నారు. ఆమె కడుపులో కేవలం బిడ్డ తల మాత్రమే ఉండటంతో విషయం వెలుగులోకి వచ్చింది.

దీనిపై బాధితురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఆ మేల్ నర్స్ ని అరెస్టు చేశారు. విచారణలో తప్పుతనదేనని అతను నిజం అంగీకరించాడు.