Asianet News TeluguAsianet News Telugu

దేశం ఏమైనా మీ జాగీరా: అమిత్ షా కు ప్రకాష్ రాజ్ కౌంటర్

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై సినీనటుడు ప్రకాష్ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికలను పానిపట్టు యుద్ధంతో పోల్చడంపై ఆయన ఫైర్ అయ్యారు. ఇదేమీ 1761 కాదు బీజేపీ నేతలు మరాఠాలు కాదు.. దేశ జనాభా ఆఫ్ఘాన్ సైన్యమూ కాదు అంటూ ట్విట్టర్ వేదికగా ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. 
 

actor prakash raj counter on bjp presidnt amit shah
Author
Bengaluru, First Published Jan 13, 2019, 8:25 AM IST

బెంగళూరు: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై సినీనటుడు ప్రకాష్ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికలను పానిపట్టు యుద్ధంతో పోల్చడంపై ఆయన ఫైర్ అయ్యారు. ఇదేమీ 1761 కాదు బీజేపీ నేతలు మరాఠాలు కాదు.. దేశ జనాభా ఆఫ్ఘాన్ సైన్యమూ కాదు అంటూ ట్విట్టర్ వేదికగా ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. 

ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న అమిత్ షాను కడిగి పారేశారు. ‘దేశం ఏమైనా మీ జాగీరా’ అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ ప్రతినిధుల సదస్సులో అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. పానిపట్టు యుద్ధంలో మరాఠాల ఓటమితో దేశం విదేశీయుల చేతుల్లోకి వెళ్లిపోయిందని ఆ తర్వాత ఆంగ్లేయుల పాలనలో 200 ఏళ్లు బానిసత్వాన్ని అనుభవించామని చెప్పుకొచ్చారు. 

2019 ఎన్నికల్లో ప్రజలు బీజేపీకే పట్టం కట్టాలని, లేకుంటే మళ్లీ బానిసత్వంలోకి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అమిత్ షా వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. ఇకపోతే లోక్‌సభ ఎన్నికల్లో బరిలో నిలిచేందుకు సినీనటుడు ప్రకాష్ రాజ్ రెడీ అయ్యారు. 

బెంగళూరు సెంట్రల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి రంగం చేసుకుంటున్నట్లు ఇటీవలే ప్రకటించారు. ఇప్పటికే కేంద్రం తీరుపై పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రకాష్ రాజ్ అవకాశం దొరికినప్పుడల్లా ఉతికి ఆరేస్తున్నారు. తాజాగా అమిత్ షాపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తుండటంతో ప్రకాష్ రాజ్ ఎన్నికల ప్రచారం మెుదలు పెట్టేశారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. 

 

Follow Us:
Download App:
  • android
  • ios