రెడ్ లైట్ ఏరియాపై దాడి చేసి.. మహిళను నగ్నంగా ఊరేగించారు

https://static.asianetnews.com/images/authors/d7f5adfb-1610-5d53-be8e-55db5850d97e.jpg
First Published 21, Aug 2018, 11:32 AM IST
Accused Of Murder, Woman Thrashed, Paraded Naked In Bihar By Mob
Highlights

నగ్నంగా ఊరేగించారు. చెప్పులతో దారుణంగా కొట్టారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో.. వారు రెడ్ లైట్ ఏరియాకు వచ్చి పరిస్థితిని సమీక్షించారు. 

ఓ యువకుడి హత్యకు కారకంగా అనుమానిస్తూ.. ఓ మహిళ పట్ల దారుణంగా ప్రవర్తించారు. ఆమెను చితకబాది.. నగ్నంగా ఊరేగించారు. ఈ దారుణ సంఘటన బీహార్ రాష్ట్రంలోని భోజ్‌పూర్ జిల్లాలోని దామోదర్‌పూర్‌లో ఆదివారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. విమలేశ్ షా(19) అనే యువకుడు ఆదివారం అదృశమయ్యాడు. సమీపంలోని రైల్వేట్రాక్ వద్ద విమలేశ్ మృతదేహం సోమవారం ఉదయం లభ్యమైంది. 

దీంతో ఆగ్రహించిన దామోదర్‌పూర్ గ్రామస్తులు.. రైల్వేట్రాక్ పక్కనే ఉన్న రెడ్ లైట్ ఏరియాపై దాడి చేశారు. అక్కడున్న ఉన్న షాపులను ధ్వంసం చేసి.. వాహనాలను తగులబెట్టారు. అనుమానంతో ఓ మహిళను ఆమె ఇంట్లో నుంచి బయటకు లాగి తీవ్రంగా చితకబాదారు. యువకుడిని ఆ మహిళనే హత్య చేసి ఉంటుందని భావించి.. నగ్నంగా ఊరేగించారు. చెప్పులతో దారుణంగా కొట్టారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో.. వారు రెడ్ లైట్ ఏరియాకు వచ్చి పరిస్థితిని సమీక్షించారు. మహిళను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

ఈ ఘటనపై ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ స్పందించారు. మహిళను నగ్నంగా ఊరేగించడం విచారకరమన్నారు. బీహార్‌లో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయన్నారు. శాంతిభద్రతలను మెరుగుపరిచి.. మహిళలకు రక్షణ కల్పించాలని సీఎం నితీష్ కుమార్‌ను తేజస్వీ యాదవ్ కోరారు.

loader