చెన్నై:తమిళనాడు రాష్ట్రంలోని రిచ్చి బజార్ లో గురువారం నాడు బాంబు పేలుడు చోటు చేసుకొంది. కంట్రీమేడ్ బాంబు పేలినట్టుగా పోలీసులు నిర్ధారించారు. ఈ పేలుడు వల్ల ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదని అధికారులు ప్రకటించారు.

 చైనా దేశాధ్యక్షుడు జిన్‌పింగ్  తమిళనాడు రాష్ట్ర పర్యటనకు ఒక్క రోజు ముందే  ఈ ఘటన చోటు చేసుకోవడం ప్రస్తుతం తమిళనాడులో చర్చనీయాంశంగా మారింది.

తమిళనాడు రాష్ట్రంలోని మామిళ్లపురంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పర్యటించనున్నారు. ప్రధాని మోడీతో కలిసి జిన్‌పింగ్ పర్యటిస్తారు. జిన్‌పింగ్ పర్యటనకు ఒక్క రోజు ముందే  రిచ్చి బజార్ లో పేలుడు వాటిల్లింది.  దీంతో మామిళ్లపురంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. 

ఓ మహిళను చంపేందుకు ఆరుగురు గ్రూపు సభ్యుల బృందం ప్రయత్నించింది. ఆమె తప్పించుకొంది. ఈ సమయంలో నాటు బాంబు (కంట్రీమేడ్ బాంబు)ను ఆమె పైకి విసిరారు.  ఆ సమయంలో ఆ మహిళ ఆటోరిక్షాలో పారిపోతోంది. ఆటోపై నాటు వేయడంతో  ఆటో ధ్వంసమైంది.

బాధిత మహిళ లాయర్. ఈ ఆరుగురు ఆమెను చంపేందుకు ప్రయత్నించారు.  అయితే ఆమె స్వల్ప గాయాలతో బయటపడింది.జిన్‌పింగ్ పర్యలనతో రెండు దేశాల మద్య సంబంధాలను మరింత బలోపేతమయ్యే అవకాశాలు ఉన్నాయని ఈ రెండు దేశాలు భావిస్తున్నారు.ఆరుగురు నిందితుల్లో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలిన వారి  కోసం గాలింపు చర్యలు చేపట్టారు.