ముంబైలో బుధవారం అర్థరాత్రి ఈ నివాస భవనం కూలింది. ఈ ప్రమాదంలో 11 మంది మరణించారు. మరో 8 మంది గాయపడ్డారు భారీ వర్షాల కారణంగా భవనం కూలినట్లు మహారాష్ట్ర మంత్రి చెప్పారు.

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఘోర ప్రమాదం సంభవించింది. ముంబైలోని మల్వానీలో బుధవారం రాత్రి 11 గంటల సమయంలో నాలుగు అంతస్థుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 11 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 8 మది మంది తీవ్రంగా గాయపడ్డారు. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

సమాచారం అందుకున్న పోలీసులు, విపత్తు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ప్రమాదం జరిగిన సమయంలో పిల్లలు కూడా ఉన్నారు. సహాయక బృందాలు 15 మందిని రక్షించాయి గాయపడినవారిని బిడీబీఎ మున్సిపల్ జనరల్ ఆస్పత్రికి తరలించారు 

భారీ వర్షాల కారణంగా భవనం కూలినట్లు మహారాష్ట్ర మంత్రి అస్లాం షేక్ తెలిపారు. భారీగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో పక్కన ఉన్న భవనాన్ని అధికారులు ముందు జాగ్రత్త చర్యగా ఖాళీ చేయించారు