విమానంలో ప్రయాణిస్తున్న తోటి ప్రయాణికురాలి పట్ల ఓ బిజినెస్ మెన్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెను అసభ్యంగా తాకుతూ.. లైంగికంగా వేధించాడు. ఈ సంఘటన దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త  అనిల్ కుమార్ మూల్ చందానీ(65) విస్తారా విమానయాన సంస్థకు చెందిన విమానంలో ముంబయికి బయలు దేరారు. అదే విమానంలో భారత సంతతికి చెందిన సింగపూర్ మహిళ ప్రయాణిస్తోంది. ఆమె అనిల్ కుమార్ పక్కసీట్లో కూర్చుంది.

కాగా.. దీనిని అవకాశంగా తీసుకున్న అనిల్ కుమార్.. ఆమెను అసభ్యంగా తాకుతూ..లైంగికంగా వేధించాడు. దీంతో ఆమె అతనిపై సహారా విమానాశ్రయ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితుడైన అనిల్ కుమార్ పై ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.