Covid-19 Omicron India: దేశంలో క‌రోనా పంజా.. కొత్త‌గా 6,041 ఒమిక్రాన్ కేసులు

Covid-19 Omicron India: భార‌త్ లో  ఒమిక్రాన్ కేసులు సంఖ్య‌ 6 వేలు దాటింది. ఇప్పటివరకు  దేశంలో 6,041 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో అత్య‌ధికంగా మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల్లో కేసులు నమోదు అయ్యాయి. మ‌రోవైపు దేశంలో 2.68 లక్షల పైగా క‌రోనా కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో అత్య‌ధికంగా 24,383 కేసులు న‌మోదు కాగా.. ముంబై లో11,317 కేసులు, బెంగళూరులో 20,121 కేసులు, చెన్నై లో 8,963 కేసులు, కోల్‌కతా లో6,867 కేసులు న‌మోద‌య్యాయి. 

6041 Omicron Cases Were Registered In India

Covid-19 Omicron India: ప్రపంచ దేశాల‌ను వణికిస్తోన్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్ లోనూ విజృంభిస్తోంది. ఈ వేరియంట్ త‌న పంజా విసురుతోంది. దీంతో రోజు రోజుకూ కేసుల సంఖ్య భారీగా  పెరుగుతోంది. ఒకవైపు కరోనా, మరోవైపు ఒమిక్రాన్ కేసులు విజృంభించ‌డంతో భార‌త్ లో ధ‌ర్డ్ వేవ్ ప్రారంభ‌మైన‌ట్టు వైద్య, ఆరోగ్య నిపుణులు భావిస్తోన్నారు. దేశంలో ఒమిక్రాన్ కేసులు దేశంలో 6 వేలు దాటింది. ఇప్పటివరకు 6,041 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి.

మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల్లో అత్యధిక కేసులు నమోదు అయ్యాయి.  రోజువారీ పెరుగుదల 5%. గత సంవత్సరం డెల్టా వేవ్‌తో పోలిస్తే ఈ సంఖ్య చాలా వేగంగా పెరగడంతో, అత్యధికంగా వ్యాపించే అవకాశం ఉన్న వేరియంట్, కేసులు వేగంగా పెరగడానికి కారణమని అనుమానిస్తున్నారు. ఈ తరంగం మధ్య, భారతదేశం యొక్క రికవరీ రేటు ఒక రోజు క్రితం 95.20% నుండి 94.83%కి తగ్గింది.


మరోవైపు దేశంలో మళ్లీ కరోనా పడగ విప్పుతోంది. రోజురోజుకూ కరోనా విజృంభిస్తుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,68,833 కేసులు నమోదయ్యాయి. అదే స‌మ‌యంలో  1,22,684 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 14 లక్ష17 వేల 820 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దీంతో దేశంలో కోవిడ్ పాజిటివ్ రేటు 16.66 శాతానికి చేరింది. 
అదే స‌మయంలో కోవిడ్‌తో 402 మంది ప్రాణాలు కోల్పోయారు.దీంతో మొత్తంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4.85 లక్షల చేరింది. మహారాష్ట్రలో క‌రోనా విజృంభిస్తోంది. అత్య‌ధికంగా 43 వేల 211 కేసులు నమోదు అయ్యాయి.ఆ త‌రువాత‌.. కర్ణాటకలో 28,723 కేసులు. ఢిల్లీలో 24,383 కేసులు, తమిళనాడులో 23,459 కేసులు, పశ్చిమ బెంగాల్‌లో 22,645 కేసులు నిర్ధారణ అయింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్, కేరళల్లో 16 వేలకు పైగా కేసులు వెలుగులోకి వ‌చ్చాయి. అలాగే.. రాజస్థాన్‌లో కొత్తగా 10,307 కేసులు వెలుగులోకి వ‌చ్చాయి. బీహార్‌లో 6,500, ఏపీలో 4,528, మధ్యప్రదేశ్‌లో 4,755, తెలంగాణలో 2,398, చండీగఢ్‌లో 1,834 కేసులు వెలుగులోకి వ‌చ్చాయి. 

ముమ్మరంగా వ్యాక్సినేషన్‌.. మరోవైపు కరోనా కట్టడి కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు సిద్ద‌మయ్యాయి. ఈ క్ర‌మంలో దేశ వ్యాప్తంగా  వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరం చేశాయి.  నిన్నఒక్క రోజే.. 57.37 లక్షల మంది కరోనా టీకా తీసుకున్నారు. అదేవిధంగా 3.92 లక్షల మంది బూస్ట‌ర్ డోసుల‌ను తీసుకున్నారు. అలాగే ఇప్ప‌టి వ‌ర‌కూ మొత్తం 156 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ చేసిన‌ట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.  

అదే స‌మయంలో ప‌లు రాష్ట్ర ప్ర‌భుత్వాలు కరోనా ఆంక్షలు క‌ఠిన‌త‌రం చేస్తోన్నాయి. ఈ క్ర‌మంలో ప‌లు రాష్ట్రాల్లో స్కూళ్లు తెరవడంపై కీలక నిర్ణయాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతానికి పిల్లలకు ఆన్‌లైన్ పాఠాలే కొనసాగించాలని కేరళ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లోనూ పాఠ‌శాలను తెర‌వ‌డంపై సందిగ్థంలో ఉన్నారు. సెలవులు పెంచాల‌ని యోచిస్తోన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios