5G In India: దేశంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ శ‌నివారం 5G సేవలను ప్రారంభించనున్నారు. ప్ర‌గ‌తి మైదాన్ లో జ‌రిగే ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ ఆరవ ఎడిషన్ కార్య‌క్ర‌మ‌లో 5జీ సేవ‌ల‌ను ప్రారంభిస్తారు.  

5G In India: దేశంలో 5జీ సేవ‌లు అందుబాటులోకి వ‌స్తున్నాయి. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ శ‌నివారం నాడు 5G సేవలను ప్రారంభించనున్నారు. అక్టోబర్ 1న న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో 5జీ సేవలను ప్రారంభించనున్నారు. ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ (IMC) ఆరవ ఎడిషన్‌ను కూడా ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. ఇండియ‌న్ మొబైల్ కాంగ్రెస్-2022 "న్యూ డిజిటల్ యూనివర్స్" థీమ్‌తో అక్టోబర్ 1 నుండి 4 వరకు జరగనుంది. ఈ కార్య‌క్ర‌మం అనేక మంది ప్రముఖ ఆలోచనాపరులు, పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలు, ప్రభుత్వ అధికారులను ఒకచోట చేర్చి, డిజిటల్ టెక్నాలజీని వేగంగా స్వీకరించడం-వ్యాప్తి చేయడం ద్వారా ఉత్పన్నమయ్యే ప్రత్యేక అవకాశాలను చర్చించడానికి, ప్రదర్శించడానికి వీలు కల్పిస్తుందని పీఎంవో ఒక ప్రకటనలో తెలిపింది. అక్టోబర్ 12 నాటికి 5Gని ప్రారంభిస్తామని కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించిన ఒక నెల తర్వాత ప్ర‌ధాని మోడీ 5జీ సేవ‌ల‌ను ప్రారంభిస్తున్నారు.

Scroll to load tweet…

డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DOT), టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఈ ఏడాది ప్రారంభంలో నిర్వహించిన 5G స్పెక్ట్రమ్ వేలంలో రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, అదానీ డేటా సర్వీసెస్, వోడాఫోన్ ఐడియాలు రూ. 1,50,173 కోట్ల విలువైన 5G స్పెక్ట్రమ్‌కు వేలం వేసాయి. రిలయన్స్ జియో మొత్తం విలువలో 58.65 శాతం వాటాతో అతిపెద్ద బిడ్డర్‌గా నిలిచింది. 43,084 కోట్ల విలువైన బిడ్‌లతో పాల్గొన్న నలుగురిలో భారతీ ఎయిర్‌టెల్ రెండవ అతిపెద్ద బిడ్డర్ గా ఉంది. 

1800 MHz, 2100 MHz, 2500 MHz, 3300 MHz, 26 GHzలలో 6,228 MHz స్పెక్ట్రమ్‌లను కొనుగోలు చేసేందుకు Vodafone Idea Limited రూ.18,799 కోట్ల విలువైన బిడ్‌లు వేసింది. భారతదేశంలో 5G స్పెక్ట్రమ్ మొట్టమొదటి వేలం జూలై 26న ప్రారంభమైంది. ఏడు రోజులలో జరిగిన మొత్తం 40 రౌండ్ల బిడ్డింగ్ తర్వాత వేలం కోసం బిడ్డింగ్ ముగిసింది. మొత్తం 40 రౌండ్ల బిడ్డింగ్ నిర్వహించారు. అంతకుముందు ఆగస్టులో, టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు స్పెక్ట్రమ్ కేటాయింపు లేఖలను ప్రభుత్వం జారీ చేసింది. అదే సమయంలో దేశంలో 5G సేవలను రోల్ అవుట్ చేయడానికి సిద్ధం చేయాలని కోరింది. అన్ని ప్రధాన టెలికాం ఆపరేటర్లు దేశవ్యాప్తంగా 5G సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు.

Scroll to load tweet…