నాలుగేళ్ల చిన్నారి బోరు బావిలో పడిపోయాడు. కాగా.. ఆ చిన్నారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.  ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మోహోబా ప్రాంతంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే..  మెహోబా ప్రాంతానికి చెందిన ధనేంద్ర అలియాస్ బాబు అనే నాలుగేళ్ల చిన్నారి ఆడుకుంటూ ఆడుకుంటూ పొరపాటున దాదాపు 30 అడుగుల లోతు ఉన్న బోరుబావిలో పడిపోయాడు. అందులో పడిపోయిన తర్వాత చిన్నారి ఏడుపు స్థానికులకు వినపడటంతో.. అక్కడకు వెళ్లి చూశారు.

వెంటనే చిన్నారి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. వారి సహాయంతో చిన్నారిని బయటకు తీసేందుకు సహాయక సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. ఈ సంఘటన బుధవారం మధ్యాహ్నం 2గంటల సమయంలో చోటుచేసుకుంది. కాగా.. ఇప్పటికీ సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. చిన్నారిని బయటకు ప్రాణాలతో క్షేమంగా తీసుకువచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా..  ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.