ఛత్తీస్‌ఘడ్‌లో ఎదురు కాల్పులు: నలుగురు మావోయిస్టుల మృతి

ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో  ఇవాళ జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు.

4 Naxalites killed in encounter with security personnel in Chhattisgarh's Bijapur lns


న్యూఢిల్లీ: ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని బీజాపూర్ అటవీ ప్రాంతంలో  మంగళవారంనాడు మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య  ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి.ఈ ఘటనలో  నలుగురు మావోయిస్టులు మృతి చెందారు.బీజాపూర్ జిల్లాలోని  కొర్చెలి అటవీ ప్రాంతంలో  ఇవాళ ఉదయం  పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్టుగా పోలీసులు ప్రకటించారు.  ఘటన స్థలంలో  కూంబింగ్ కొనసాగుతుందని  భద్రతా దళాలు ప్రకటించాయి.

ఇవాళ ఉదయం ఆరు గంటలకు గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని లేంద్ర గ్రామ సమీపంలో  ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపాయి.ఎదురు కాల్పులు ఆగిన తర్వాత సంఘటన స్థలంలో చూస్తే నలుగురు మావోయిస్టులు మృతి చెందారని  పోలీసులు ప్రకటించారు.  సంఘటన స్థలం నుండి  లైట్ మెషిన్ గన్ తో పాటు ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టుగా పోలీసులు తెలిపారు.

సోమవారంనాడు చత్తీస్ ఘడ్ లోని  సుక్మా జిల్లాలో  జరిగిన ఎన్ కౌంటర్ లో  ఓ మావోయిస్టు మృతి చెందారు.ఘటన స్థలం నుండి బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్ రైఫిల్ ను, మావోయిస్టు మెటీరియల్ ను స్వాధీనం చేసుకున్నట్టుగా పోలీసులు తెలిపారు.

 

 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశాలున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ అభిప్రాయాన్ని ఇక్కడ షేర్ చేయండి. Have your say! 📢https://telugu.asianetnews.com/mood-of-andhra-survey

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios