PM Modi: నాటి కల నేడు సాకారం.. 32 ఏళ్ల నాటి మోదీ ఫోటోలు వైరల్..
PM Modi: అయోధ్య రామ మందిరంలో జనవరి 22 న రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహాత్సవం జరుగనున్నది. ఆ బాల రాముడి విగ్రహా ప్రాణ ప్రతిష్ఠకు ముహూర్తం సమీపిస్తున్న వేళ.. రోజుకో విషయం వెలుగులోకి వస్తుంది. తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ సంబంధించిన 32 ఏళ్ల నాటి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఆ విషయమేమింటో మీరు కూడా తెలుసుకోండి.
Ayodhya Ram temple: యావత్ హిందూ సమాజం ఎదురుచూస్తున్న ఒకే ఒక్క క్షణం అయోధ్యలో రామ మందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠ. ఎన్నో ఏళ్లుగా ఈ మధుర ఘట్టం గురించి వేచి ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందూవులందరీ కలలు నెరవేరుస్తూ.. జనవరి 22 న అయోధ్య రామ మందిరంలో రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహాత్సవం జరుగనున్నది. ఆ బాల రాముడి విగ్రహా ప్రాణ ప్రతిష్ఠకు ముహూర్తం సమీపిస్తున్న వేళ.. రోజుకో విషయం వెలుగులోకి వస్తుంది.
తాజాగా సరిగ్గా 32 ఏళ్ల క్రితం ఇదే రోజున.. నరేంద్రమోదీ అయోధ్య రామాలయానికి చేరుకున్నారు. కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు చేపట్టిన నరేంద్ర మోదీ 1992 జనవరి 14న అయోధ్యలోని రామజన్మభూమికి చేరుకున్నారు. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ శ్రీరాముడికి పూజలు చేశారు. విగ్రహాన్ని టెంట్‌లో ఉంచి, అది చూసి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. 'జై శ్రీరామ్' నినాదాల మధ్య, నరేంద్ర మోడీ రామ మందిరం కట్టినప్పుడే తిరిగి వస్తానని ప్రతిజ్ఞ చేశారంటూ.. అలనాటి జ్ఙాపకాలను గుర్తు చేస్తూ 32 ఏళ్ల క్రితం ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇప్పుడు ఆ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరలవుతున్నాయి.
రామ మందిరం గురించిన సందేశాన్ని దేశ వ్యాప్తం చేయడానికి నరేంద్ర మోడీ ఆనాడు ఈ యాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. కాశ్మీర్‌ను భారత్‌తో విలీనం చేయడం ద్వారా జనసంఘ్, బిజెపి తపస్సు. హిందువుల శతాబ్దాల పట్టుదలతో నరేంద్ర మోడీ ప్రభుత్వంలో భగవాన్ శ్రీరామ్ తన జన్మభూమిలో తిరిగి ప్రతిష్టించబడుతుంది. నరేంద్ర మోడీ కల నేరవేరింది. అని పేర్కొన్నారు.
11 రోజుల పాటు ప్రధాని దీక్ష
ఇదిలా ఉండగా.. అయోధ్యలోని రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమం లేదా "ప్రాన్ ప్రతిష్ఠ"కు ముందు ప్రధాని మోదీ శుక్రవారం 11 రోజుల ప్రత్యేక ఆచారాన్ని ప్రారంభించారు. జాతికి ఉద్వేగభరితమైన సందేశంలో ప్రధానమంత్రి మోడీ “తొలిసారి తాను భావోద్వేగానికి లోనవుతున్నాను. ఈ భావాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాను. జీవితంలో తొలిసారి ఇలాంటి పరిస్థితి ఎదుర్కుంటున్నాను. అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో స్వయంగా పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆ కార్యక్రమానికి సాక్షిగా నిలవడం సంతోషంగా ఉంది. నేటి నుంచి 11 రోజుల పాటు విశేష అనుష్టానంలో పాల్గొననున్నాను. ప్రాణ ప్రతిష్ట కోసం ఆ భగవంతుడు తనను ఓ పరికరంగా వాడుకుంటున్నాడు. దేశ ప్రజల ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నాను. అంటూ ప్రధాని తన సందేశంలో తెలిపారు.
ప్రాణ ప్రతిష్ట వేళ.. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి విలువైన వస్తువులు అయోధ్యకు చేరుకుంటున్నాయి. ముఖ్యంగా గుజరాత్, ఒడిశా, జమ్మూ కాశ్మీర్ నుంచి దీపాలు, ధూపం బత్తీలు అయోధ్య నగరానికి చేరకుంటున్నాయి.అలాగే ఆ కార్యక్రమం కోసం ప్రత్యేకమైన బలగాలు పహారా కాస్తున్నాయి. అయోధ్య పట్టణమంతా డ్రోన్లతో నిఘా పెట్టారు. ఎటువంటి అవాంతరాలు తలెత్తకుండా భద్రతా సిబ్బంది అలర్టయ్యారు.