భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ వ్యక్తిపై నుండి మూడు రైళ్లు పోయాయి. అయినా ఆయనకు చిన్న గాయం కూడ కాలేదు. మూడు రైళ్లు పోయినా తర్వాత  కూడ ఆయన లేచి కూర్చున్నాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం కల్గించింది.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఆశోక్‌నగర్ కు చెందిన ధర్మేంద్ర రైలు పట్టాలపై పడి ఉన్నాడు. అతనిపై నుండి రైలు వెళ్లింది.ఇదే విషయాన్ని ఓ రైలు డ్రైవర్ గుర్తించి సమీపంలోని రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

అయితే పోలీసులు సంఘటన స్థలానికి వచ్చేలోపుగా ధర్మేంద్రపై నుండి మూడు రైళ్లు వెళ్లాయి.ధర్మేంధ్ర వద్దకు పోలీసులు వెళ్లేసరికి అతను రైలు పట్టాలపై లేచి కూర్చున్నాడు.

దీంతో పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు. రైలు పట్టాలపై పడి ఉన్న ధర్మేంధ్రపై నుండి మూడు రైళ్లు వెళ్లినా కూడ చిన్న గాయం కూడ కాలేదు. పోలీసులు రాగానే ధర్మేంధ్ర లేచి కూర్చొని నాన్న వచ్చాడు అంటూ అన్నాడు. ఈ మాటలు విన్న పోలీసులు షాక్ కు గురయ్యారు.

మద్యం తాగిన ధర్మేంద్ర మత్తులో రైలు పట్టాలపై నిద్రపోయాడు. అయితే మత్తులో తాను ఎక్కడ పడుకొన్నాడో కూడ ధర్మేంద్ర గుర్తించలేదు. ధర్మేంద్ర రైలు పట్టాలపై పడుకొన్న సమయంలోనే ఆయన పడుకొన్న రైలు పట్టాలపై నుండి మూడు రైళ్లు వెళ్లాయి.

రైళ్లు వెళ్లిన సమయంలో ధర్మేంద్ర ఎటూ కదలకపోవడంతో ధర్మేంద్రకు ఎలాంటి గాయాలు కాలేదు. రైలు పట్టాలపై పడుకొన్న వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడానికి పడుకొని ఉన్నాడని భావించి ఓ రైలు డ్రైవర్ రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

రైల్వే పోలీసులు ధర్మేంద్ర  వద్దకు రాగానే ఆయన లేచి కూర్చోవడం షాక్ ఇచ్చింది.