విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో రోడ్డుపై బైక్‌తో విన్యాసాలు చేశారు. బైక్ స్టంట్స్ చేయ‌బోయిన క్ర‌మంలో.. బైక్‌ అదుపు త‌ప్పి ముగ్గురు యువకులు అక్కడికక్కడే మరణించారని పోలీసులు తెలిపారు. 

 ఓ ముగ్గురు యువకులు బైక్‌పై స్టంట్స్‌ చేస్తూ.. ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో చోటుచేసుకుంది. బెంగళూరు విమానాశ్రయానికి వెళ్లే రహదారిలో ఆదివారం ఈ ప్ర‌మాదం జ‌రిగింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరులోని గోవిందపుర ప్రాంతానికి చెందిన ముగ్గురు యువ‌కులు ఆదివారం తెల్ల‌వారుజామున బైక్ ‌పై బ‌య‌ట‌కు వెళ్లారు. విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో రోడ్డుపై బైక్‌తో విన్యాసాలు చేశారు. బైక్ స్టంట్స్ చేయ‌బోయిన క్ర‌మంలో.. బైక్‌ అదుపు త‌ప్పి ముగ్గురు యువకులు అక్కడికక్కడే మరణించారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న యెలహన్క పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.