Asianet News TeluguAsianet News Telugu

శ్రీలంక పేలుళ్లలో ముగ్గురు భారతీయుల మృతి, వారు వీరే..

పేలుళ్ల సంఘటనపై సుష్మా స్వరాజ్ శ్రీలంక విదేశాంగ మంత్రి తిలక్ మరపానతో మాట్లాడారు. శ్రీలంక పేలుళ్ల ఘటనపై ఆమె వరుసగా ట్వీట్లు చేశారు. పేలుళ్లలో ముగ్గురు భారతీయులు మరణించినట్లు నేషనల్ హాస్పిటల్ వర్గాలు తమతో చెప్పినట్లు కొలంబోలోని భారత హై కమీషన్ తెలియజేసిందని ఆమె తెలిపారు. 

3 Indians Killed In Sri Lanka Blasts, Says Foreign Minister Sushma Swaraj
Author
New Delhi, First Published Apr 21, 2019, 10:10 PM IST

న్యూఢిల్లీ: శ్రీలంకలో జరిగిన వరుస పేలుళ్లలో ముగ్గురు భారతీయులు మరణించినట్లు భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. ఈస్టర్ పర్వదినాన మూడు చర్చిల్లో, నాలుగు లగ్జరీ హోటళ్లలో, ఓ హౌసింగ్ కాంప్లెక్స్ పై పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో 200 మందికి పైగా అసువులు బాశారు. 400 మందికి పైగా గాయపడ్డారు.

పేలుళ్ల సంఘటనపై సుష్మా స్వరాజ్ శ్రీలంక విదేశాంగ మంత్రి తిలక్ మరపానతో మాట్లాడారు. శ్రీలంక పేలుళ్ల ఘటనపై ఆమె వరుసగా ట్వీట్లు చేశారు. పేలుళ్లలో ముగ్గురు భారతీయులు మరణించినట్లు నేషనల్ హాస్పిటల్ వర్గాలు తమతో చెప్పినట్లు కొలంబోలోని భారత హై కమీషన్ తెలియజేసిందని ఆమె తెలిపారు. 

లక్ష్మి, నారాయణ్ చంద్రశేఖర్, రమేష్ అనే ముగ్గురు భారతీయులు మరణించినట్లు ఆమె తెలిపారు. మరిన్ని వివరాలు తెలుసుకుంటున్నట్లు ఆమె తెలిపారు. 

ఇదిలావుంటే, కేరళకు చెందిన రజీనా అనే 58 ఏళ్ల మహిళ మృత్యువాత పడినట్లు ఎఎన్ఐ తెలిపింది. ఆమె దుబాయ్ లో స్థిరపడినట్లు తెలుస్తోంది. 

మానవపరమైన అన్ని రకాల సాయం అందిస్తామని తాము శ్రీలంక విదేశాంగ మంత్రికి తెలిపినట్లు సుష్మా స్వరాజ్ తెలిపారు. తమ వైద్య బృందాలను పంపిస్తామని కూడా చెప్పినట్లు ఆమె చెప్పారు. 

శ్రీలంకలో చిక్కుకున్న భారతీయులు కొలంబోలోని భారత హై కమిషన్ కార్యాలయాన్ని సంప్రదించాలని, తాము అన్ని రకాల సాయం అందిస్తామని ఆమె తెలిపారు. అందుకు సంబంధించిన ఫోన్ నెంబర్లు కూడా ఆమె ఇచ్చారు. 

Follow Us:
Download App:
  • android
  • ios