శానిటైజర్ పోసి జర్నలిస్టులను హత్య చేసిన ఘటనలో ఉత్తరప్రదేశ్‌ పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. లక్నోకు చెందిన 37 ఏళ్ల జర్నలిస్టు రాకేష్‌సింగ్‌ నిర్భిక్‌, మరో జర్నలిస్టు పింటు సాహులపై హత్యాయత్నం జరిగింది. రాకేష్ సింగ్ నిర్భిక్ అక్కడిక్కడే మరణించాగా, పింటు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

గ్రామసర్పంచ్‌ చేస్తున్న అక్రమాలపై వరుస కథనాలు ప్రచురించినందుకే వీరి మీద హత్యాయత్నం జరిగింది. తండ్రిమీద కథనాలు రాశారన్న కోపంతో కాల్వారి గ్రామ సర్పంచ్ కుమారుడు మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి నేరానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆల్కహాల్ శాతం ఎక్కువగా ఉన్న శానిటైజర్‌ను జర్నలిస్టులపై పోసి ఆ తర్వాత నిప్పుపెట్టినట్లు పోలీసులు తెలిపారు. 

ఈ ఘనటలో సాహు అక్కడికక్కడే మరణించగా, మరో జర్నలిస్టు రాకేష్‌ సింగ్‌ కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరారు. శరీరం అప్పటికే 80 శాతానికి పైగా కాలడంతో కొద్ది గంటల వ్యవధిలోనే ఆయన కూడా ప్రాణాలు కోల్పోయారు. సర్పంచి చేస్తోన్న అవినీతిపై వరుస కథనాలు ప్రచురించడం, సాహుతో డబ్బు చెల్లింపులు లాంటి వివాదాలు ఉండటంతో ఇద్దరినీ చంపేందుకు పథకం రచించినట్లు తెలుస్తోంది. 

ఈ కేసులో సర్పంచ్ కుమారుడు రికు మిశ్రాకు, ఇదివరకే పలు క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్న స్నేహితుడు అక్రమ్, లలిత్‌ మిశ్రా సహకరించినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. జర్నలిస్ట్‌ రాకేష్‌ సింగ్‌ చనిపోవడానికి ముందు తనపై హత్యాయత్నం చేసింది సర్పంచి కుమారుడేనని చెబుతూ ఓ వీడియో చేశాడు. అక్రమాలపై వరుస కథనాలు రాస్తూ నిజాయితీ గల జర్నలిస్టుగా ఉ‍న్నందుకు ఇదే నాకు లభించిన బహుమతి అంటూ వీడియోలో పేర్కొన్నాడు. 

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాదాపు 17 మందిని విచారించారు. ఇరువురి మధ్య ఉన్న పాత తగాదాల కారణంగా పథకం ప్రకారం జర్నలిస్టులను హత్య చేయించినట్లు బలరామ్‌పూర్‌ పోలీసు చీఫ్ దేవ్ రంజన్ వర్మ తెలిపారు.