Delhi Crime News: ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి అత్యంత దారుణంగా హత్య చేసి నాలుగేళ్లుగా పరారీలో ఉన్న నిధి అనే నేరస్థురాలిని ఉత్తరప్రదేశ్‌లోని ఆమె స్వస్థలమైన ఘజియాబాద్‌లో అరెస్టు చేశారు ఢిల్లీ పోలీసులు.
Delhi Crime News: కిడ్నాప్, హత్య కేసులో నాలుగేళ్లుగా పరారీలో ఉన్న మహిళ దోషి(27)ని ఢిల్లీ పోలీసులు ఆదివారం అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. నిధి అనే నేరస్థురాలిని ఉత్తరప్రదేశ్‌లోని ఆమె స్వస్థలమైన ఘజియాబాద్‌లో అరెస్టు చేసినట్లు తెలిపారు. 2015లో సాగర్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి.. అత్యంత దారుణంగా హత్య చేసిన కేసులో ఆమె దోషి.
అయితే.. 2018లో అత్యవసర బెయిల్ మీద బయటకు వచ్చిన ఆమె కనిపించకుండా.. ఆజ్ఞాతంలోకి పోయిందని, పోలీసులు ఎంత వెతికిన..ఆమె ఆచూకీ దొరకలేదు. మరుసటి ఏడాది ఆమెను మోస్ట్ వాంటెండ్ క్రిమినల్ గా పోలీసులు ప్రకటించారు. ఈ క్రమంలో నిధి తన స్వస్థలమైన ఘజియాబాద్‌లోని గోవిందపురంలో ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందటంతో .. ఒక్కసారిగా పోలీసులు రంగంలోకి దిగారు. ఆమెను ఒక కేఫ్ దగ్గర అరెస్టు చేసినట్టు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (స్పెషల్ సెల్) జస్మీత్ సింగ్ తెలిపారు.
పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. నిధి, ఆమె భర్త రాహుల్ జాత్‌తో సహా తొమ్మిది మంది వ్యక్తులు కలిసి.. యూపీకి చెందిన సాగర్ అనే యువకుడిని ఏప్రిల్ 1, 2015న ఢిల్లీలోని జిటిబి ఎన్‌క్లేవ్ ప్రాంతంలో కిడ్నాప్ చేశారు. అనంతరం.. సాగర్ ను ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌కు తీసుకెళ్లి విచక్షణ రహితంగా దాడి చేసి.. ఆపై ట్రక్కుతో ఢీ కొట్టి చంపారు. యాక్సిడెంట్ కేసు నమోదు చేసుకున్నారు. పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
హత్య వెనుక ఉద్దేశ్యాన్ని వివరిస్తూ.. నిధి సోదరి ఆర్తితో సాగర్ చాలా చనువుగా, స్నేహంగా ఉంటున్నాడనీ, సాగర్ పై ఆగ్రహం వ్యక్తంచేసింది. పలు మార్లు హెచ్చరించినప్పటికీ.. సాగర్ ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. ఈ తరుణంలోనే ఆర్తి కి మరొకరితో వివాహం చేశారు. అంత సెట్ అయ్యిందని నిధి దంపతులు భావించారు. కానీ.. ఆర్తీ వివాహం తర్వాత కూడా ఆమెను కలుసుకుంటూనే ఉన్నాడు. దీంతో ఆగ్రహానికి గురైన వారు.. సాగర్‌ను హత్య చేయాలని నిర్ణయించుకున్నారని పోలీసులు తెలిపారు. ప్లాన్ ప్రకారం.. హత్య చేసి ప్రమాదం గా చిత్రీకరించారు. ఈ క్రమంలో వారిని ఏడు సంవత్సరాల జైలు శిక్షపడింది.
అనంతరం.. రాహుల్ కూడా బెయిల్‌పై బయటకు వచ్చారు. రాహుల్ పేరుమోసిన రోహిత్ చౌదరి మరియు అంకిత్ గుర్జార్ గ్యాంగ్‌లో సభ్యుడు. రాహుల్ పై హత్య, హత్యాయత్నం, అపహరణ వంటి మూడు కేసుల్లో ప్రమేయం ఉన్నాడని, అంతకుముందు ఢిల్లీలో ఆయుధ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
