Coronavirus: త‌మిళ‌నాడులో క‌రోనా క‌ల‌క‌లం.. మెడిక‌ల్ కాలేజీలో 200 మందికి క‌రోనా

Coronavirus: త‌మిళ‌నాడులో క‌రోనా వైర‌స్ కొత్త కేసులు పెరుగుతున్నాయి. ఆందోళ‌న‌క‌ర స్థాయిలో కోవిడ్‌-19 విజృంభ‌ణ కొన‌సాగుతున్న‌ది. వేలూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో 200 మందికి పైగా వైద్యసిబ్బందికి కరోనా బారిన‌ప‌డ‌టంతో స్థానికంగా ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతున్న‌ది. 
 

200 staffers at Vellore CMC Hospital test Covid positive, non-emergency services stopped

Coronavirus: భార‌త్ లో క‌రోనా వైర‌స్ పంజా విసురుతోంది. రోజురోజుకూ త‌న ప్ర‌భావం పెంచుకుంటున్న వైర‌స్‌... మ‌రింత ఆందోళ‌న క‌రంగా వ్యాపిస్తోంది. ద‌క్షిణాధి రాష్ట్రమైన త‌మిళ‌నాడులో క‌రోనా (Coronavirus) విజృంభ‌ణ కొన‌సాగుతోంది.  నిత్యం న‌మోద‌వుతున‌న్న కొత్త కేసులు అధికం అవుతూనే ఉన్నాయి. ఈ నేప‌థ్యంలోనే వేలూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజ్(Christian Medical College-CMC) హాస్పిటల్‌లో క‌రోనా క‌ల‌క‌లం రేపింది. సీఎంసీలోని 200 మందికి పైగా వైద్య సిబ్బందికి  క‌రోనా వైర‌స్ సోకింది. దీంతో స్థానికంగా ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతున్న‌ది. సీఎంసీ ఆస్ప‌త్రి వైద్య సిబ్బందికి క‌రోనా సోకిన విష‌యం గురించి వేలూరు కార్పొరేషన్ సిటీ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ టి మణివన్నన్ మాట్లాడుతూ.. గత వారం రోజుల నుంచి కరోనా వైర‌స్ (Coronavirus) బారిన‌ప‌డుతున్న ఆరోగ్య కార్యకర్తల సంఖ్య పెరుగుతున్న‌ద‌ని అన్నారు. అయితే, హ‌స్పిట‌ల్ యాజ‌మాన్యం క‌రోనా వైర‌స్ వ్యాప్తిని నియంత్రించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్న‌ద‌ని వెల్ల‌డించారు. 

"గ‌త వారం రోజులుగా సీఎంసీలో Coronavirus బారిన‌ప‌డుతున్న వైద్య సిబ్బంది సంఖ్య పెరుగుతోంది. వీరంద‌రూ కూడా కోవిడ్‌-19 తేలిక‌పాటి ల‌క్ష‌ణాల‌తో బాధ‌ప‌డుతున్నారు. క‌రోనా సోకిన వారి వైద్యుల కోసం ప్ర‌త్యేక కోవిడ్‌-19 కేర్ వార్డును ఏర్పాటు చేశారు. క‌రోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించ‌డానికి ఆస్ప‌త్రి వ‌ర్గాలు అన్ని రకాల చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి" అని వెల్లూర్ కార్పొరేషన్ సిటీ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ టి మణివన్నన్ వెల్ల‌డించారు. వేలూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజ్(Christian Medical College-CMC) హాస్పిటల్‌లో  మొత్తం 2,000 మంది వైద్యులు సహా 10,500 మంది ఆరోగ్య సిబ్బంది పనిచేస్తున్నారు. ఆస్ప‌త్రిలో అధిక సంఖ్య‌లో వైద్య సిబ్బంది కరోనా వైర‌స్ బారిన‌ప‌డ‌టం వైద్య సేవ‌ల పై ప‌డింది.  నేపథ్యంలో ఆస్పత్రిలో సాధార‌ణ వైద్య సేవ‌లు నిలిచిపోయాయి. అయితే,  అత్య‌వ‌స‌ర (ఎమ‌ర్జెన్సీ) వైద్య సేవ‌లు మాత్రం కొన‌సాగుతాయ‌ని సంబంధిత వ‌ర్గాలు పేర్కొన్నాయి. 

వేలూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజ్(Christian Medical College-CMC) హాస్పిటల్‌లో అధిక సంఖ్య‌లో వైద్యులు క‌రోనా బారిన‌ప‌డ‌టం.. ఆయా ప్రాంతాల్లో క‌రోనా కొత్త కేసులు పెరుగుతుండ‌టంతో అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. ఈ క్ర‌మంలోనే వేలూరు సిటీ మునిసిపల్ కార్పొరేషన్ (VCMC) క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ సమీపంలోని బాబూరావు వీధిని 'కంటైన్‌మెంట్ జోన్'గా ప్రకటించింది.  అక్క‌డ కొత్త‌గా ఆరుగురి క‌రోనా సోకింది. వారి బంధువుల‌కు సైతం క‌రోనా (COVID-19) సోకిన‌ట్టు అధికారులు పేర్కొన్నారు. క‌రోనావైర‌స్ (Coronavirus) వ్యాప్తిని నియ‌త్రించ‌డానికి చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని అధికారులు తెలిపారు. ప్ర‌జ‌లంద‌రూ కూడా క‌రోనా వైర‌స్ నిబంధ‌న‌లు పాటించాల‌నీ, మాస్కులు ధ‌రించ‌డం వంటి త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని వేలూరు సిటీ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు ప్ర‌జ‌ల‌కు సూచించారు. 

ఇదిలావుండ‌గా, త‌మిళ‌నాడులో క‌రోనా (Coronavirus) కేసులు క్ర‌మంగా పెరుగుతున్నాయి. రోజువారీ కేసులు 10 వేల మార్కును దాటాయి. అయితే, కొత్త‌గా న‌మోద‌వుతున్న కేసుల్లో అత్య‌ధికం రాష్ట్ర రాజ‌ధాని చెన్నైలోనే వెలుగుచూడ‌టంతో స్థానికంగా ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. రాష్ట్రంలో న‌మోదైన కొత్త కేసుల్లో దాదాపు 46 శాతం చెన్నైలో నివేదించ‌బ‌డ్డాయి. పాజిటివిటీ రేటు సైతం 7.9 శాతానికి పెరిగింది. Coronavirus కేసులు పెరుగుద‌ల అధిక‌మైంద‌నీ, నిత్యం రెండు వేల మంది వ‌ర‌కు ఆస్ప‌త్రుల్లో చేరుతున్నార‌ని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుబ్ర‌మ‌ణియ‌న్ వెల్ల‌డించారు. క‌రోనా (COVID-19) కేసులు పెరుగుద‌ల‌కు అనుగుణంగా ఆరోగ్య మౌలిక సదుపాయాలు  ఏర్పాటు చేస్తున్నామ‌నీ, ప్ర‌జ‌లు భయ‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. క‌రోనా ఉధృతి నేప‌థ్యంలో అంద‌రూ జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios