లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. అక్కాచెల్లెళ్లు ఓ చెట్టుకు వేలాడుతూ ఆదివారంనాడు కనిపించారు. అంతకు ముందు రోజు తల్లి వారిని తీవ్రంగా కొట్టినట్లు పోలీసులు చెబుతున్నారు. 

అక్కాచెల్లెళ్ల వయస్సు 18, 19 ఏళ్లు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సంబాల్ జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు కూడా శనివారం ఇంటి నుంచి బయటకు వెళ్లారు. తల్లి చేతిలో దెబ్బలు తిన్న తర్వాత శనివారం రాత్రి నుంచి కనిపించుకుండా పోయారు. 

పశువులకు దాణా పెట్టలేదని వారిద్దరిని తల్లి కొట్టినట్లు చెబుతున్నారు. అక్కాచెల్లెళ్ల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అస్పత్రికి తరలించారు 

నిరుడు అక్టోబర్ లో ఉత్తరప్రదేశ్ లోని మైన్ పురిలో 15 ఏళ్ల బాలిక చెట్టుకు వేలాడుతూ కనిపించింది. దుపట్టాను మెడకు చుట్టుకుని చెట్టుకు ఉరేసుకుని మరణించింది.