చెన్నై: జల్లికట్టులో సమయంలో ప్రమాదం చోటు చేసుకోవడంతో ఇద్దరు మరణించారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని తమిళనాడు రాష్ట్రంలోని కృష్ణగిరి జిల్లాలో ఆదివారం నాడు చోటు జరిగింది.

భవనం కూలిన ఘటనలో ఇద్దరు మరణించారు. పలువురు గాయపడ్డారు. జల్లికట్టు పోటీలను తిలకించేందుకు పెద్ద ఎత్తున స్థానికులు అక్కడకు చేరుకొన్నారు. భవనాలపై ఎక్కి జల్లికట్టు పోటీలను తిలకిస్తున్నారు. ఈ సమయంలో ఓ భవనం కుప్పకూలి ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. 

రాష్ట్రంలో జల్లికట్టును 2014లో సుప్రీంకోర్టు నిషేధించింది. అయితే 2017 జనవరి మాసంలో జల్లికట్టుపై నిషేధాన్ని సడలించింది.  జల్లికట్టుపై నిషేధాన్ని ఎత్తివేయాలని పెద్ద ఎత్తున ఆందోళనలు సాగాయి.

జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలని దాఖలైన పిటిషన్ పై విచారణ చేసిన సుప్రీంకోర్టు  నిషేధాన్ని ఎత్తివేసింది.జల్లికట్టు పోటీల సమయంలో గాయపడిన వారు చనిపోయిన ఘటనలు కూడా అనేకం చోటు చేసుకొన్నాయి.

ప్రతి ఏటా సంక్రాంతి పర్వదినం సమయంలో తమిళనాడు వాసులు జల్లికట్టు పోటీల్లో పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పోటీల్లో పెద్ద ఎత్తున పాల్గొంటారు.