అహ్మదాబాద్‌ : గుజరాత్‌ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 18 మంది దుర్మరణం చెందారు. 32 మంది గాయాలపాలయ్యారు. వివరాల్లోకి వెళ్తే 50 మంది ప్రయాణికులతో వెళుతున్న బస్సు బనస్కాంత జిల్లా అంబాజీ పట్టణం వద్ద బోల్తా పడింది. 

త్రిశూలియా ఘాట్‌ వద్ద వేగంగా దూసుకుచ్చిన లగ్జరీ బస్సు ఒక్కసారిగా బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50 మంది ప్రయాణీకులున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు 108 బృందంతోపాటు ఘటనా స్థలానికి చేరుకున్నారు.  

బస్సులో చిక్కుకున్న వారిని స్ధానికుల సహకారంతో వెలుపలికి తీసుకువచ్చారు. తొలుత ఐదుగరు అక్కడికక్కడే చనిపోగా మరికొందరు ఆస్పత్రికి తీసుకెళ్లే మార్గమధ్యలో ప్రాణాలు విడిచారు. మెుత్తం 18 మంది దుర్మరణం చెందగా మిగిలిన వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

మరోవైపు గుజరాత్ బస్సు ప్రమాదంపై ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలు విచారం వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై ఆరా తీశారు. చనిపోయిన వారికి నివాళులర్పించారు. మృతుల బంధువులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.