Asianet News TeluguAsianet News Telugu

ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్ పై క‌రోనా పంజా.. 1700 మంది ఢిల్లీ పోలీసుల‌కు క‌రోనా

భారత్‌లో కరోనా త‌న విశ్వ‌రూపం చూపిస్తోంది. జెట్ స్పీడ్ వేగంతో  ఢిల్లీ, మహారాష్ట్రలో కరోనా కోరలు చాస్తోంది. మ‌రి ముఖ్యంగా క‌రోనా ఫ్రంట్​ లైన్​ వర్కర్స్​ కూడా వైరస్​ బారిన పడుతున్నారు. ఢిల్లీలో 1,700 మంది పోలీసులకు వైరస్​ సోకితే.. మహారాష్ట్రలో 481 మంది వైద్యులు క‌రోనా మహమ్మారి బారిన పడ్డారు.
 

1700 Delhi police personnel tested COVID 19 positive from Jan 1 to Jan 12 Data
Author
Hyderabad, First Published Jan 12, 2022, 4:36 PM IST

 భారత్‌లో కరోనా త‌న విశ్వ‌రూపం చూపిస్తోంది. జెట్ స్పీడ్ వేగంతో పరుగులు పెడుతోంది. మ‌రి ముఖ్యంగా.. ఢిల్లీ, మహారాష్ట్ర‌లో క‌రోనా కోరలు చాస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య  పెరిగిపోతుంది. ఈ క్ర‌మంలో క‌రోనా​ ఫ్రంట్​లైన్ వారియర్స్​గా ఉన్న పోలీసులు, వైద్యులుపై కరోనా విరుచుకుపడుతున్న‌ట్టు తెలుస్తోంది. సూమారు 1700 మంది ఢిల్లీ పోలీసులు క‌రోనా బారిన ప‌డిన‌ట్టు ఢిల్లీ పోలీస్​ శాఖ తెలిపింది. 

కేవలం జనవరి 1 నుంచి 12వ తేదీ లోపే .. 1,700 మంది ఢిల్లీ పోలీసు సిబ్బంది కరోనావైరస్ బారిన ప‌డిన‌ట్టు అధికారులు తెలిపారు. సోమవారం వరకు డిపార్ట్​మెంట్​లో 1000 మందికి వైరస్​ సోక‌గా.. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే మరో 700 కేసులు వెలుగులోకి వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో సమావేశాలు అన్నీ వర్చువల్​గా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వైరస్​ సోకిన వారు హోం క్వారెంటైన్​కు పరిమితం కావాలని సూచించారు. వారందరూ బాగానే ఉన్నారని, ప్ర‌స్తుతం బాధితులంద‌రూ  క్వారెంటైన్ లో ఉన్నారని. వారంద‌రూ కోలుకున్న తర్వాత డ్యూటీలో చేరతారని తెలిపారు.   అర్హులైన వారికి బూస్టర్ డోస్ ఇవ్వడానికి పోలీసు ప్రధాన కార్యాలయ సిబ్బంది కోసం ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు  తెలిపారు.  
 
క‌రోనా విజృంభించడంతో.. ముందు జాగ్రత్తగా.. జై సింగ్ మార్గ్‌లోని ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో పనిచేస్తున్న సిబ్బంది కోసం ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశామ‌ని, అలాగే..అర్హులైన వారికి బూస్టర్  డోస్ ఇస్తున్న‌ట్టు అధికారులు తెలిపారు.  పిహెచ్‌క్యూ గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఆఫీసర్స్ లాంజ్‌లో ఉదయం 11:30 గంటల నుండి కోవిడ్ వ్యాక్సిన్ యొక్క ముందు జాగ్రత్త మోతాదు (బూస్టర్) ఇవ్వడానికి ప్రత్యేక ఏర్పాట్లు నిర్వహించబడ్డాయి. కానీ.. రెండవ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న తొమ్మిది నెలలు పూర్తి చేసిన అర్హులైన పోలీసు సిబ్బంది మాత్రమే బూస్టర్ అర్హుల‌ని  స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (వెల్ఫేర్) షాలినీ సింగ్ చెప్పారు. 
  
విధి నిర్వహణలో సామాజిక దూరాన్ని పాటించడం, మాస్క్‌లు ధరించడం, చేతుల పరిశుభ్రత పాటించడం వంటి వాటి ప్రాముఖ్యత గురించి తమ సిబ్బందికి కచ్చితంగా తెలియజేయాలని అధికారులకు సూచించామని షాలినీ సింగ్  చెప్పారు.

 ఈ తరుణంలో  ఢిల్లీ పోలీసు సిబ్బందికి , వారి కుటుంబాలకు సహాయం అందించడానికి, హౌజ్ ఖాస్, ద్వారక, జపాన్ పూరి, మోడల్ టౌన్, షాలిమార్ బాగ్, కొండ్లీ మరియు వినయ్ మార్గ్‌లోని సెక్యూరిటీ సెక్షన్‌లలో పనిచేస్తున్న ఢిల్లీ పోలీస్ వెల్‌నెస్ సెంటర్‌ల గురించి అందరు సిబ్బందికి సమాచారం అందించనున్నారు.  పోలీసు సిబ్బంది స్వీయ పర్యవేక్షణ పద్ధతిని అవలంబించాలని, ఏదైనా అనారోగ్య స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతుంటే.. పర్యవేక్షణ అధికారికి తప్పకుండా నివేదించాలని తెలిపారు.  

మ‌రో వైపు.. మహారాష్ట్ర‌లో క‌రోనా క‌రాళ నృత్యం చేస్తోంది. క‌రోనా వైరస్​ విజృంభిస్తోంది. క్ర‌మంగా కేసుల సంఖ్య పెరుగుతోంది. దీనితో పాటే వైరస్​ బారిన పడే వైద్యుల సంఖ్య కూడా ఎక్కువ అవుతోంది. గ‌త వారం రోజుల వ్య‌వ‌ధిలో 481 మంది వైద్యులకు క‌రోనా సోకిన‌ట్టు మహారాష్ట్ర అసోసియేషన్ ఆఫ్​ రెసిడెంట్​ డాక్టర్స్​ ప్రెసిడెంట్​ డా. అవినాష్​ ధహిపాలే తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios