ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. షాజహాన్‌పూర్‌లో ఓ ట్రక్కు అదుపుతప్పి రెండు టెంపోలను ఢీకొట్టింది. ఈ ఘటనలో 16 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలవ్వగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

ప్రమాద విషయం తెలుసుకున్న యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని.. బాధితులకు అండగా ఉండాలని ఆయన అధికారులను ఆదేశించారు.