దేశంలో కామాంధులకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అన్న తేడా లేకుండా లైంగిక దాడికి పాల్పడుతున్న మృగాళ్లు బాలురను కూడా వదలడం లేదు.

తాజాగా హర్యానాలో 15 ఏళ్ల బాలుడిపై తోటి బాలురే అత్యాచారం చేశారు. వివరాల్లోకి వెళితే... గురుగ్రామ్ అశోక్ విహార్‌లో 15 ఏళ్ల మతిస్థిమితం లేని బాలుడు తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నాడు.

ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన ముగ్గురు మైనర్ బాలురు అతడిపై కన్నేశారు. ఓ రోజు బాలుడు ఇంట్లో ఒంటరిగా ఉండటం గమనించి వారు లోపలికి ప్రవేశించారు. బాలుడిని ఇంటి నుంచి బయటకు దూరంగా తీసుకొచ్చి ముగ్గురు కలిసి లైంగిక దాడికి పాల్పడ్డారు.

అనంతరం బాలుడిని అక్కడే వదిలి పరారయ్యారు. కొద్దిసేపటి తర్వాత అటుగా వెళ్తున్న కొందరు స్థానికులు బాలుడిని గుర్తించి.. అతని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పేరేంట్స్ బాలుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు..

అయితే మర్మావయవాలలో తీవ్రగాయాలు కావడంతో బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.