మహారాష్ట్రలోని మల్కాపూర్ లో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. నేషనల్ హైవే నెంబర్ 6 పై భారీ కంటైనర్ వచ్చి... మినీ వ్యాన్ ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో వ్యాన్ లో ప్రయాణిస్తున్న 13మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రగాయాలపాలయ్యారు.

కంటైనర్ అతివేగంగా రావడం వల్లే అదుపుతప్పి.. మినీ వ్యాన్ ని ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. దాదాపు 50మీటర్ల దూరం మినీ వ్యాన్ ని... కంటైనర్ ఈడ్చుకెళ్లడం గమనార్హం. దీంతో.. మినీ వ్యాను నుజ్జునుజ్జు అయ్యింది. మృతుల్లో ఆరుగురు మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్‌ జిల్లా నాగజిరికి చెందిన వారిగా గుర్తించారు. పనికోసం సొంతూరు నుంచి జలగౌవ్‌ వెళ్లే సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.