Asianet News TeluguAsianet News Telugu

వివాహేతర సంబంధం.. బిడ్డకు తండ్రి ఎవరు..?

వివాహేతర సంబంధం... ఓ బిడ్డ పుట్టుక ప్రశ్నార్థంగా మారింది. బిడ్డ నాకే పుట్టాడంటూ.... ఓ పరాయి వ్యక్తి అనడం గమనార్హం. దీనంతటికీ వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు గుర్తించారు. 

11month boy kidnaped by father's friend in yashwanthpur
Author
Hyderabad, First Published May 29, 2019, 9:54 AM IST

వివాహేతర సంబంధం... ఓ బిడ్డ పుట్టుక ప్రశ్నార్థంగా మారింది. బిడ్డ నాకే పుట్టాడంటూ.... ఓ పరాయి వ్యక్తి అనడం గమనార్హం. దీనంతటికీ వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు గుర్తించారు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... కుమార్, జాన్‌లు ఒకే సంస్థలో సూపర్‌వైజర్లగా పని చేస్తున్నారు.  రెండేళ్ల నుంచి వీరు స్నేహితులు. ఈక్రమంలో కుమార్‌ భార్యతో జాన్‌ సన్నిహితంగా ఉండేవాడు.  కొంతకాలంగా జాన్, కుమార్‌ మద్య విభేదాలు నెలకొన్నాయి. ఈక్రమంలో ఈ నెల 24న కుమార్‌ ఇంటికి వచ్చిన జాన్‌.. బరువు తగ్గేందుకంటూ మత్తు మందు కలిపిన ఔషధాన్ని కుమార్‌ భార్యతో తాగించాడు.

ఆమె స్పృహ కోల్పోగానే 11 నెలల చిన్నారిని జాన్‌ అపహరించాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన కుమార్‌.. బాలుడు కనిపించకపోగా భార్యను ఆరా తీశాడు. జాన్‌ ఇచ్చిన ఔషధాన్ని తాగిన వెంటనే స్పృహ కోల్పోయానని, ఆ తర్వాత ఏం జరిగిందో తనకు తెలియదని పేర్కొంది. దీంతో కుమార్‌  కామాక్షిపాళ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్రమత్తమైన పోలీసులు గాలింపు చేపట్టి  రామమూర్తినగరలో తలదాచుకున్న జాన్‌ను అరెస్ట్‌ చేశారు. 

అయితే కుమార్‌ భార్యతో తనకు రెండేళ్లుగా వివాహేతర సంబంధం ఉందని, ఆమెకు పుట్టిన బిడ్డ తన బిడ్డేనని జాన్‌ వాదించాడు. అయితే ఆ పసికందు తనబిడ్డనే అని కుమార్‌ వాదించాడు. దీంతో  ఉన్నత అధికారులతో చర్చించి న్యాయ సలహా తీసుకొని ఆ చిన్నారి రక్తశ్యాంపుల్స్‌ను డీఎన్‌ఏ పరీక్షలకు పంపాలని పోలీసులు నిర్ణయించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios