జమ్మూకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మినీ బస్సు లోయలోకి దూసుకెళ్లి 11 మంది విద్యార్ధులు దుర్మరణం పాలయ్యారు.

వివరాల్లోకి వెళితే.. పూంఛ్‌లోని ఓ కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన విద్యార్ధులతో బయల్దేరిన మినీ బస్సు షోపియాన్‌ జిల్లాలోని పీర్‌కిగలీ ప్రాంతంలో లోయలో పడింది. ఈ దుర్ఘటనలో 11 మంది అక్కడికక్కడే మృతిచెందారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా.. ప్రమాద ఘటనపై జమ్మూకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను గవర్నర్ ఆదేశించారు.