డ్రగ్స్‌ వాడకాన్ని నియంత్రించడంలో తమిళనాడు ప్రభుత్వం విఫలమైందని, డీఎంకే కూడా ప్రజలకు ఉపయోగపడే ఏ పథకాన్ని నెరవేర్చలేదని ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు, మాజీ ముఖ్య‌మంత్రి ఎడప్పాడి కె పళనిస్వామి అన్నారు.  

చెన్నై: అన్నాడీఎంకేతో 10 మంది డీఎంకే ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని, వారు తమ మద్దతును మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారని తమిళనాడు ప్రతిపక్ష నేత ఎడప్పాడి కె పళనిస్వామి బుధవారం నాడు చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. అన్నాడీఎంకే నేత ఓ పన్నీర్‌సెల్వం కుమారుడు కూడా అయిన ఏఐఏడీఎంకే ఎంపీ రవీంద్రనాథ్ 'పుతుమై పెన్' పథకానికి మద్దతు ఇవ్వడం ద్వారా డీఎంకేతో సన్నిహిత బంధాన్ని పంచుకుంటున్నారని మాజీ త‌మిళ‌నాడు సీఎం ఆరోపించారు. వార్తా సంస్థ ఏఎన్ఐ నివేదించిన ప్ర‌కారం.. “తమిళనాడులో అనేక రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ, ప్రతి ఒక్కరూ అన్నాడీఎంకే పట్ల అభిమానంతో ఉన్నారు. 10 మంది డీఎంకే ఎమ్మెల్యేలు తమ వైపు మారేందుకు మాతో టచ్‌లో ఉన్నారు అని ఎడప్పాడి కె పళనిస్వామి చెప్పిన‌ట్టు పేర్కొంది. 

'పుతుమై పెన్ స్కీమ్'కు మద్దతు ఇచ్చిన తర్వాత ఓపీ రవీంద్రంత్ డీఎంకేతో సన్నిహిత సంబంధాన్ని పంచుకున్నారని కూడా ఆయన ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలల్లోని బాలికలకు ఉన్నత విద్యను అభ్యసించేందుకు రూ.1,000 అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన 'పుతుమై పెన్' పథకాన్ని రవీంద్రనాథ్ మంగళవారం మరోసారి ప్రశంసించారు. డ్రగ్స్‌ మహమ్మారిపై ఎడప్పాడి పళనిస్వామి మాట్లాడుతూ.. డ్రగ్స్‌ వాడకాన్ని నియంత్రించడంలో తమిళనాడు ప్రభుత్వం విఫలమైందని, డీఎంకే కూడా ప్రజలకు ఉపయోగపడే ఏ పథకాన్ని నెరవేర్చలేదని, అన్నాడీఎంకే అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఆపేందుకు ప్రయత్నిస్తోందని, నేరాలు రాష్ట్రంలో పెరుగుతున్నాయ‌ని అ్నారు. అలాగే, ఆన్‌లైన్ జూదం గురించి మాట్లాడుతూ "ఏఐఏడీఎంకే ఆన్‌లైన్ రమ్మీని నిషేధించాలని నిరంతరం పట్టుబడుతోంది. అయితే, ఆన్‌లైన్ జూదం నిషేధానికి సంబంధించి వివిధ పార్టీల నుండి అభిప్రాయాలను సేకరించేందుకు త‌మిళ‌నాదు సీఎం ఎంకే స్టాలిన్ మాత్రం సమావేశం నిర్వహించడం లేదు అని" ఆరోపించారు. 

Scroll to load tweet…

డీఎంకే కుటుంబ పార్టీ, కార్పొరేట్ పార్టీ.. అక్క‌డ గౌర‌వం ఉండ‌ద‌ని కూడా ప‌ళ‌నిస్వామి ఆరోపించారు.