Asianet News TeluguAsianet News Telugu

O Saathiya Review: `ఓ సాథియా` మూవీ రివ్యూ..

`చిన్నదాన నీకోసం`, `కొలంబస్‌`, `బాబు బాగా బిజీ`, `బుర్రకథ` వంటి చిత్రాలతో హీరోయిన్‌గా ఆకట్టుకున్న మిస్తీ చక్రవర్తి హీరోయిన్‌గా నటించిన చిత్రం `ఓ సాథియా`. యంగ్‌ హీరో అర్యన్‌ గౌరా హీరోగా నటించగా, దివ్య భావన దర్శకత్వం వహించారు. శుక్రవారం విడుదలైన ఈ సినిమా ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం. 

O saathiya movie review  arj
Author
First Published Jul 7, 2023, 4:30 PM IST

కంటెంట్‌ ఉన్న చిన్న సినిమాలకు ఇది మంచి టైమ్‌ అని చెప్పాలి. కథ కొత్తగా ఉండి, కథనం ఆసక్తికరంగా సాగితే, మంచి ఎంటర్టైన్‌మెంట్స్ ఉంటే చాలు నెమ్మదిగా పుంజుకుంటూ మంచి కలెక్షన్లని సాధిస్తున్నాయి. మరి తాజాగా సరికొత్త లవ్‌ స్టోరీతో రూపొందింది `ఓ సాథియా`. నితిన్‌తో `చిన్నదాన నీకోసం`, అలాగే `కొలంబస్‌`, `బాబు బాగా బిజీ`, `బుర్రకథ` వంటి చిత్రాలతో హీరోయిన్‌గా ఆకట్టుకున్న మిస్తీ చక్రవర్తి హీరోయిన్‌గా నటించిన చిత్రమిది. యంగ్‌ హీరో అర్యన్‌ గౌరా హీరోగా నటించగా, దివ్య భావన దర్శకత్వం వహించారు. శుక్రవారం విడుదలైన ఈ సినిమా ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం. 

కథః
వైజాగ్‌కి చెందిన అర్జున్‌ (ఆర్యన్‌ గౌరా) టైమ్‌పాస్‌కి బి.టెక్‌ చేస్తుంటాడు. కాలేజీలో మొదటి చూపులోనే కీర్తి(మిస్తీ చక్రవర్తి)ని చూసి ఇష్టపడతాడు. ఆమెని ఇంప్రెస్‌ చేసి పడేసే టైమ్‌లో ఆమె హైదరాబాద్‌కి వెళ్లిపోతారు. దీంతో అర్జున్‌ హార్ట్ బ్రేక్‌ అవుతుంది. హైదరాబాద్‌ లో ఉన్న విషయం తెలుసుకున్న అర్జున్‌.. కీర్తి కోసం తన బ్యాక్‌లాగ్స్ అన్ని కంప్లీట్‌ చేసి కీర్తి చదువుకునే కాలేజీలో చేరతాడు. కానీ అక్కడ ఆమెకి మరో బాయ్‌ ఫ్రెండ్‌ ఉన్నాడని తెలుస్తుంది. దీంతో అర్జున్‌కి మరోసారి హార్ట్ బ్రేక్‌ అవుతుంది. కొన్నాళ్లపాటు ఆమెతో ఫ్రెండ్‌గానే ట్రావెల్ అవుతాడు. తీరా తన బాయ్‌ ప్రెండ్‌తో బ్రేకప్‌ అయ్యిందని తెలిసి సంతోషిస్తాడు. ఆమెని ఓదార్చాలని వెళ్లగా, అప్పటికే అదే బాయ్‌ఫ్రెండ్‌ ఆమెకి భోజనం తినిపించడం చూసి మరోసారి హార్ట్ బ్రేక్‌ అవుతాడు. దీంతో ఆమెకి దూరంగా వెళ్లిపోతాడు. స్టడీస్‌ పూర్తి చేసి జాబ్‌ ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో మరోసారి కీర్తి నుంచి కాల్‌ వస్తుంది. మరి ఆ కాల్‌ ద్వారా అర్జున్‌ ఏం తెలుసుకున్నాడు? తన ప్రేమ కోసం ఆ అమ్మాయి వచ్చిందా? లేదా మళ్లీ హార్ట్ బ్రేక్‌ అయ్యిందా? ఈ లవ్‌, హార్ట్ బ్రేక్‌ల పరంపర ఎన్నిసార్లు జరిగింది, ఇంతకి ఈ ఇద్దరు కలుసుకున్నారా? ఇద్దరి మధ్య ప్రేమ ఉందా? లేదా? చివరికి ఈ ప్రేమ ఏ తీరం చేరిందనేది మిగిలిన కథ. 

విశ్లేషణః
ప్రేమ కథా చిత్రాలు చాలా వచ్చాయి. ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. జనరల్‌గా ఒక్కో స్టేజ్‌లో ఒక్కో అమ్మాయితో ప్రేమలో పడుతుంటారు. ఇలా రెండు మూడు లవ్‌ స్టోరీస్ ఉంటాయి. కానీ ఒకే అమ్మాయితో పదే పదే(ఐదు సార్లు) ప్రేమలో పడటం, బ్రేకప్‌ అవడం, ప్రేమలో పడటం, బ్రేక్ అవడమనేది కాస్త విచిత్రంగా, ఇంకాస్త కొత్తగా అనిపిస్తుంది. `ఓ సాథియా`లో అదే కొత్తదనం. అయితే దాన్ని అంతే ఫీల్‌గుడ్‌ లవ్‌ స్టోరీగా తెరకెక్కించాల్సింది. ప్రారంభంలో సరదాగా, అల్లరి చిల్లరగా ఈ లవ్‌ స్టోరీ ప్రారంభమవుతుంది. అది రాను రాను సీరియస్‌ గా మారుతుంది. అయితే ఆ అల్లరి చిల్లరగా సాగినట్టుగానే కథ కూడా అలానే సాగుతుంది. అదే కాస్త కన్విన్సింగ్‌గా అనిపించదు. ఆ తర్వాత కొన్నిసార్లు ఆ ఎమోషన్‌ పండుతుంది, మళ్లీ ఎప్పటిలాగనే మారుతుంది. సినిమా కథలాగే దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కించడం గమనార్హం. 

ఫస్టాఫ్‌ కాలేజ్‌లో చోటు చేసుకునే ఫన్‌ కాస్త నవ్విస్తుంది. హీరో ప్రెండ్స్ చైతన్య గరికపాటి, క్రేజీ ఖన్నాల కామెడీ నవ్వులు పూయిస్తుంది. సినిమాలో వీరి కామెడీనే పెద్ద రిలీజ్‌గా చెప్పొచ్చు. అదే సమయంలో హీరోయిన్‌ ప్రేమలో హీరో పదే పదే పడటం, బ్రేక్‌ అవడం వంటి సన్నివేశాలు కొంత చిరాకు తెప్పిస్తే, మరికొన్నిసార్లు కొత్తగా అనిపిస్తూ ఆసక్తిని క్రీయేట్‌ చేస్తుంటుంది. ఫస్టాఫ్‌ రొటీన్‌గానే అనిపించినా, సెకండాఫ్‌ మాత్రం ఎమోషనల్‌ టర్న్ తీసుకుంటుంది. ప్రేమలో సీనియర్‌ నెస్‌ సైతం ఎమోషనల్‌గా మారుతుంది. ఇక క్లైమాక్స్ లో ఆ ప్రేమ, ఎమోషన్‌లో పీక్‌లోకి వెళ్తుంది. క్లైమాక్స్ మాత్రం సినిమాకి బ్యాక్‌ బోన్ అని చెప్పాలి. చివరి అరగంట సేపు ఎమోషనల్‌ రోలర్‌ కోస్టర్‌లో ట్రావెల్ అవుతున్నట్టు ఉంటుంది. కానీ అదే సమయంలో చాలా ల్యాగ్‌లు, బోరింగ్ సన్నివేశాలు ఆడియెన్స్ సహనాన్ని పరీక్షిస్తూనే ఉంటాయి. క్లైమాక్స్ మాత్రం అన్నింటికి మర్చిపోయేలా చేస్తుంది. ఆడియెన్స్ గుండెబరువెక్కించి రిలీఫ్‌నిస్తుంటుంది. ఈ చిత్రం ద్వారా ఓ సెన్సిబుల్‌ లవ్‌ స్టోరీని ఆవిష్కరించారు దర్శకులు. ఆ విషయంలో సక్సెస్‌ అయ్యారు. కాకపోతే సినిమా మొత్తాన్ని అంతే పీల్‌గుడ్‌గా, ఎంటర్‌టైనింగ్‌గా తీసి ఉంటే బాగుండేది. పాటలు, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాకి బలం. డైలాగ్ లు కూడా కొత్తగా ఉన్నాయి. హత్తుకునేలా ఉన్నాయి. 

ఆర్టిస్టులు-టెక్నీషియన్లుః
హీరోహీరోయిన్లలో.. ఆర్యన్‌ గౌరా కొత్త వాడైనా చాలా బాగా చేశారు. మొదట్లో హీరో నటన ఓవర్‌ యాక్టింగ్‌లా అనిపిస్తుంది. కానీ ఆ తర్వాత అతనితో మనం కూడా ట్రావెల్‌ చేస్తాం. కొత్తవాడైనా ఫర్వాలేదనిపించాడు. మిస్తీ చక్రవర్తి లవ్‌ స్టోరీస్‌కి కేరాఫ్‌. ఆమె ఇప్పటికే చాలా సినిమాల్లో నటించారు. దీంతో ఇందులోనూ చేసుకుంటూ వెళ్లింది. హీరో ఫ్రెండ్స్ గా నటించిన చైతన్య గరికపాటి, క్రేజీ ఖన్నాలు సినిమాకి ప్రధాన బలం. వారి నటన ఆద్యంతం ఆకట్టుకుంటుంది. వినోదాన్ని పంచుతుంది. మిగిలిన పాత్రలు ఫర్వాలేదనిపిస్తాయి. ఇక టెక్నీకల్‌గా దర్శకులు దివ్య భావన ఎంచుకున్న కథ కొత్తగా ఉంది. దాన్ని అంతే ఎంగేజింగ్‌గా, వినోదాత్మకంగా, ఫీల్‌గుడ్‌గా తెరకెక్కిస్తే బాగుండేది. కాకపోతే సినిమాలో ఎలాంటి వల్గారిటీ లేదు. చాలా క్లీన్‌గా తెరకెక్కించారు. ఫ్యామిలీతో చూడొచ్చు. ఈజే వేణు కెమెరా వర్క్ బాగుంది. పెద్ద సినిమాల రేంజ్‌లో ఉంది. విన్నూ వినోద్‌ సంగీతం బాగుంది. పాటలు వినసొంపుగా ఉన్నాయి. ఆర్‌ఆర్‌ సైతం సినిమాకి అసెట్ అవుతుంది. తన్విక–జస్విక క్రియేషన్స్‌ పతాకాలపై సుభాశ్‌ కట్టా, చందన కట్టా ఖర్చుకి వెనకాడకుండా నిర్మించారు. 

ఫైనల్‌గాః వల్గారిటీ లేని క్లీన్‌ మ్యూజికల్‌ లవ్ స్టోరీ. కొంత ఓపికతో చూడాలి.
రేటింగ్‌ః 2.75


నటీనటులు– ఆర్యన్‌ గౌరా, మిస్తీ చక్రవర్తి, దేవీ ప్రసాద్, కల్పలత, ప్రమోదిని, అన్నపూర్ణమ్మ, శివన్నారయణ, చైతన్య గరికపాటి, క్రేజి ఖన్నా, బుల్లెట్‌ భాస్కర్, అంబరీష్‌ అప్పాజి తదితరులు
బ్యానర్‌– తన్విక–జస్విక క్రియేషన్స్‌
మాటలు– ఈశ్వర్‌ చైతన్య
సంగీతం– విన్నూ వినోద్‌
కెమెరా– ఈజె.వేణు
పాటలు– భాస్కరభట్ల, అనంత శ్రీరామ్, రాంబాబు గోసాల
నిర్మాతలు– సుభాశ్‌ కట్టా, చందన కట్టా
దర్శకత్వం– దివ్యభావన

Follow Us:
Download App:
  • android
  • ios