Asianet News TeluguAsianet News Telugu

`మూడో కన్ను` సినిమా రివ్యూ, రేటింగ్‌..

అమెరికాలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా తాజాగా `మూడో కన్ను` అనే సినిమా రూపొందింది. ఇటీవల విడుదలైన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

mudo kannu movie review rating arj
Author
First Published Jan 29, 2024, 10:46 PM IST | Last Updated Jan 29, 2024, 10:46 PM IST

కాన్సెప్ట్ బాగున్నా సినిమాలు చిన్నదైనా మంచి ఆదరణ పొందుతుంది. కంటెంట్‌ ఉన్న చిత్రాలను తెలుగు ఆడియెన్స్ ఆదరిస్తున్నారు. సంక్రాంతికి వచ్చిన `హనుమాన్‌` ఏ రేంజ్‌లో విజయం సాధించిందో తెలిసిందే. తాజాగా కంటెంట్‌ ప్రధానంగా వచ్చిన మరో చిన్న సినిమా `మూడో కన్ను`. అమెరికాలో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. ఇందులో ప్రధానంగా నాలుగు కథలుంటాయి. మూవీ ఆంథాలజీ తరహాలో నాలుగు దర్శకులు ఈ మూవీని రూపొందించారు. సురత్ రాంబాబు, మావిటి సాయి సురేంద్ర బాబు, డాక్టర్ కృష్ణ మోహన్కే,   బ్రహ్మయ్య ఆచార్య  దర్శకత్వం వహించారు. సాయికుమార్, శ్రీనివాస్ రెడ్డి , నిరోష, మాధవిలత వంటి వారు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

కథః 
సినిమాలో ప్రధానంగా నాలుగు కథలుంటాయి. ఈ నాలుగు కథలకు లింకేంటి? అనేది సినిమా. మొదటి కథః ఒక అందమైన ఫ్యామిలీ లో ఒక రోజు పెంపుడు కుక్క చనిపోతుంది, ఫామిలీ షాక్ లో ఉండగా హీరో మదర్ చనిపోతారు. ఈ హత్యలకు కారణం ఎవరనేది సస్పెన్స్. సర్పేంట్ DNA లక్షణాలు కలిగి ఉన్న పిల్లలని ఎవరు చంపారు? వాళ్లు ఎలా చనిపోయారు అనేది ఈ కథ.  
రెండవ కథః
ప్రపంచంలో  ఇప్పుడు ఇప్పుడే టెక్నాలజీ మారుతున్న తరుణంలో మనిషి తయారు చేసిన కృతిమ మాంసం కోసం  జరిగిన ఫైట్ ఫార్ములా ఎవరిది?. ఎవరు దొంగలించారు? హార్డ్ డిస్క్ లో ఏమి ఉంది, దాన్ని ఎవరు దొంగిలించారనేది మిగిలిన కథ. 
మూడవ కథః
ఒక నేరంలో ఒక నేరస్తుడిని పట్టుకునే స్కెచ్ లో జరిగిన ఒప్పదం పిల్లవాడుతో చేయిస్తారు. మరి దాన్ని ఎవరు చేయించారు? ఎవరికోసం చేయించారు? అనేది సినిమా చూడాలి.
నాలుగోవ కథ :  
ముందు జరిగిన మూడు కథల సస్పెన్స్ ఇందులో రివీల్‌ అవుతాయి. అదేంటనేది మిగిలిన సినిమా. 

విశ్లేషణః 
ఇది అమెరికా లో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించారు. ఇందులో ఉన్న నాలుగు కథలకు ఒక్కొక్కరు డైరెక్ట్ చేశారు. ఈ నాలుగు కథలో ట్విస్ట్ లు, టర్న్ లు హైలైట్‌గా నిలుస్తాయి. వీటికితోడు ఎమోషన్స్ మెయిన్‌ కోర్‌ పాయింట్‌గా నిలుస్తుంది. నాలుగు కథలకు చివర్లో ఇచ్చిన లింక్‌, వాటిని ఓపెన్‌ చేయడం వంటివి చాలా సర్‌ప్రైజింగ్‌గా అనిపిస్తాయి. మాములుగా ఆంథాలజీ చిత్రాలు అందరికీ నచ్చుతాయి. సాయికుమార్, శ్రీనివాస రెడ్జ్ వాళ్ల నరేషన్ తో అదరగొడతాడు అని అందరికీ తెలుసు. సరిగ్గా ఇదే ఫార్మాట్ లో `మూడో కన్ను` చిత్రంలో కథనం కూడా కనిపిస్తుంది. కెమెరా టేకింగ్, ఎమోషన్స్ ని హ్యాండిల్ చేసిన విధానం బాగుంది.  నలుగురు దర్శకులు రూపొందించిన సినిమా కావడంతో ట్రీట్‌ మెంట్‌ చాలా కొత్తగా ఉంది. వేరే ఒక రచయిత రాసిన కథని నలుగురు దర్శకులు డీల్ చేయటం విశేషం. 

అయితే సినిమాకి పనిచేసిన నలుగురూ కొత్త దర్శకులు కావడంతో అనుభవ లేమి కనిపిస్తుంది. కొన్ని సీన్లనీ డీల్ చేసే విషయంలో కొంత తడబాటు కనిపిస్తుంది. దీంతో ఎమోషన్స్, ట్విస్ట్ తేలిపోయినట్టుగా అనిపిస్తాయి. అంత కిక్‌ ఇవ్వలేదు. అక్కడ అక్కడ స్లో నెరేషన్ ఉంటుంది. కొన్ని చోట్ల ఇంకా కాస్త బాగా కథని ప్రెసెంట్ చేస్తే బాగుండేది. క్రైమ్‌, థ్రిల్లర్‌ అంశాలను ఇంకా బాగా డీల్‌ చేస్తే ఆడియెన్స్ ఆ థ్రిల్‌ని ఫీల్‌ అయ్యేవారు. మరోవైపు ఇలాంటి కథలను జనాల్లోకి తీసుకెళ్లడం కష్టం, వారికి కనెక్ట్ కావడం కష్టం. ఆ విషయంలో మేకర్స్ ఫోకస్‌ పెట్టకపోవడం కూడా సినిమాకి మైనస్‌గా చెప్పొచ్చు.  మొత్తంగా`మూడోకన్ను` చిత్రంలో గ్రాండ్ విజువల్ ఎలిమెంట్స్ సహా  ప్రతీ తెలుగు ప్రేక్షకుడుకి థ్రిల్ కలిగించేలా ఉండే ఎమోషన్స్ ని ఆకట్టుకునే విధంగా అందించిన ట్రీట్ అని చెప్పవచ్చు. 

నటీనటులు, టెక్నీషియన్ల పనితీరు..
సాయికుమార్‌ సినిమాని తన భుజాలపై మోశారు. ఎమోషన్స్ ని బాగా కలిపించారు. వీరితోపాటు శ్రీనివాస్‌ రెడ్డి, నిరోషి, మాధవిలత, దేవి ప్రసాద్‌, వీరశంకర్‌, దయానంద్‌ రెడ్డి, కాశీ విశ్వనాత్‌, చిత్రం శ్రీను, సత్యశ్రీ తమ పాత్రలకు న్యాయం చేశారు. నటనతో మెప్పించారు. టెక్నికల్ టీం లో మ్యూజిక్ వర్క్ ఇంకా బెటర్ గా చేయాల్సింది. విజువల్స్ మాత్రం బాగున్నాయి. రిచ్‌ లుక్‌ కనిపిస్తుంది. లొకేషన్స్ రిచ్ గా ఉన్నాయి. ఎడిటింగ్ కూడా బానే ఉంది. ఇక దర్శకులు  విషయానికి వస్తే.. వాళ్లు మళ్ళీ రొటీన్ కథాంశాన్నే  ఎంచుకోకుండా మంచి స్క్రిప్ట్, యదార్థ సంఘంటన అధారంగా తీసి దానిని తెరకెక్కించిన తీరుతో మెప్పించారు. ఫ్యామిలీ ఎమోషన్ ని కూడా సమపాళ్ళలో క్యారీ చేస్తూ గ్రాండ్ ట్రీట్ ని అందించారు. దీనితో కొన్ని పొరపాట్లు మినహాయిస్తే ఈ సినిమా విషయంలో నలుగురు సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. నిర్మాణ విలువలు చాలా గ్రాండ్ గా ఉన్నాయి. 

ఫైనల్‌గాః ఫ్యామిలీ  ఎమోషన్స్ తో కూడిన మంచి టైమ్‌ పాస్‌ మూవీ `మూడో కన్ను`. 
రేటింగ్‌ః 2.5

నటీనటులు: సాయికుమార్, శ్రీనివాస్ రెడ్డి , నిరోష , మాధవిలత , కౌశిక్ రెడ్డి , దేవి ప్రసాద్. వీర శంకర్, దయానంద రెడ్డి , ప్రదీప్ రుద్ర, కాశీ విశ్వనాథ్,
చిత్రం శ్రీను. తిరుపతి మాధవ , సత్య శ్రీ తదితరులు.
దర్శకులు: సురత్ రాంబాబు,మావిటి సాయి సురేంద్ర బాబు ,డాక్టర్ కృష్ణ మోహన్కే,   బ్రహ్మయ్య ఆచార్య , 
కెమేరా : ముజీర్ మాలిక్ , వెంకట్ మన్నం, అక్షయ్, 
ఫైట్స్ : శంకర్ ఉయ్యాలా 
మ్యూజిక్ : స్వర 
ఎడిటర్ : మహేష్ మేకల 
స్టోరీ , డైలాగ్స్ , స్క్రీన్ ప్లే : కే.వి రాజమహి 
నిర్మాతలు: కే వి రాజమహి , సునీత రాజేందర్ దేవులపల్లి 
విడుదల తేదీ : జనవరి 26, 2024

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios