రివ్యూః `మిస్టేక్` మూవీ రివ్యూ, రేటింగ్.. సినిమా ఎలా ఉందంటే?
`రామ్ అసుర్` చిత్రంతో మెప్పించిన అభినవ్ సర్దార్ ప్రధాన పాత్రలో నటించి, తనే ఏఎస్‌పీ బ్యానర్‌పై `మిస్టేక్` చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ భరత్ కొమ్మాలపాటి దర్శకత్వం వహించిన చిత్రమిది. శుక్రవారం(ఆగస్ట్ 4న)న విడుదలైంది. ఈ సినిమా ఆడియెన్స్ ని ఎంగేజ్ చేసిందా? లేదా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
కంటెంట్ ఉన్న సినిమాలకు పట్టం కడుతున్నారు ఆడియెన్స్. కథలో విషయం లేకపోతే స్టార్ హీరోల సినిమాలను కూడా లైట్ తీసుకుంటున్నారు. ఎంత పెద్ద స్టార్ అయినా పక్కన పెడుతున్నారు. కంటెంట్ ఉన్న చిన్న సినిమాలను, కొత్త నటీనటుల సినిమాలను సైతం ఎంకరేజ్ చేస్తున్నారు. ఓటీటీల కారణంగా ఆడియెన్స్ లో చాలా మార్పు వచ్చింది. అది కొందరి నిర్మాతలకు చుక్కలు చూపిస్తుంటే, మరికొందరికి కాసుల వర్షం కురిపిస్తుంది. చిన్న కాన్సెప్ట్ అయినా సరే ఇంట్రెస్టింగ్‌గా చెబితే ఆడియెన్స్ ఎంకరేజ్ చేస్తున్నారు. మరి అలాంటి చిన్న కాన్సెప్ట్ తోనే వచ్చిన సినిమా `మిస్టేక్`. `రామ్ అసుర్` చిత్రంతో మెప్పించిన అభినవ్ సర్దార్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రమిది. తనే ఏఎస్‌పీ బ్యానర్‌పై `మిస్టేక్` చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ భరత్ కొమ్మాలపాటి దర్శకత్వం వహించిన చిత్రమిది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. నేడు శుక్రవారం(ఆగస్ట్ 4న)న విడుదలైంది. అజయ్ కతుర్‌వర్, సుజిత్, తేజ ఐనంపూడి, కరిష్మా కుమార్, తానియా కల్రా, ప్రియా పాల్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ఆడియెన్స్ ని ఎంగేజ్ చేసిందా? లేదా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
కథః
అగస్త్య(అజయ్ కథుర్వర్)- మిత్ర(ప్రియా), మహదేవ్ శర్మ(సుజిత్ కుమార్)-పార్వతి(నయన్ సారికా), కార్తిక్(తేజ ఐనంపూడి)-స్వీటి(తనియా కార్లా) మూడు ప్రేమ జంటలు. వీరంతా మంచి స్నేహితులు. వీరికి ఓ సమస్య వస్తుంది. ముగ్గురు మేల్ లవర్స్ కి మూడు రకాల సమస్యలు. వారి ప్రత్యర్థుల చేత చంపేస్తామనే వార్నింగ్‌లుంటాయి. దీంతో వారి నుంచి తప్పించుకునేందుకు వారం పది రోజులపాటు ట్రిప్ ప్లాన్ చేస్తారు. తమ లవర్స్ తో కలిసి ట్రిప్ వెళ్తారు. ఈ ఆరుగురు ఒకే కలర్ ప్యాంట్‌లు ధరిస్తారు. వాటిని కార్తిక్ ఆర్డర్ చేస్తాడు. రోడ్ మధ్యలో ఓ భయంకరమైన కిల్లర్(అభినవ్ సర్దార్) వీరిని వెంబడిస్తాడు. తుపాకితో కాల్చుతూ దాడి చేస్తుంటారు. అతన్నుంచి తప్పించుకునే క్రమంలో ఓ దట్టమైన అడవిలోకి పరిగెడతారు. అందులో అనేక ఇబ్బందులు ఫేస్ చేస్తారు. ఒక్కొక్కరుగా తమ ప్యాంట్లని వదిలేసుకుంటారు. ఆ దట్టమైన అడవిలో మరుగుజ్జు జాతి వ్యక్తులను కలుస్తారు. అక్కడ కాసేపు సరదాగా గడుపుతారు. కానీ చివరికి తమని వెంబడిస్తున్న కిల్లర్‌కి దొరికిపోతారు. అతన్ని ఎవరు పంపించారు? వీరిని ఎందుకు వెంబడిస్తున్నాడు? ఇంతకి అతనెవరు? ఈ ముగ్గురు లవర్స్ కి ప్రత్యర్థులతో జరిగిన గొడవలేంటి? ఒకే రకమైన కలర్ ప్యాంట్లలో ఏముంది? చివరికి వీరి కథ ఏ తీరం చేరిందనేది మిగిలిన సినిమా.
విశ్లేషణః
ఒక చిన్న మిస్టేక్ వల్ల ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి? అవి ఎలాంటి మలుపులకు దారితీస్తాయి? కొన్ని సార్లు మిస్టేక్ వెలకట్టలేని నష్టాలను తెచ్చిపెడితే మరికొన్ని సార్లు ఆ మిస్టేక్ కొందరికి ప్రయోజనాలను సృష్టిస్తుంది. అదే ఈ సినిమా కథ. చిన్న పాయింట్ ఆధారంగా ఈ సినిమాని రెండు గంటలపాటు నడిపించిన తీరు బాగుంది. దాన్ని ఎంగేజింగ్‌గా తీసుకెళ్లిన తీరు ఆకట్టుకునేలా ఉంది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా కథని నడిపించడం ఈ సినిమాలో హైలైట్ పాయింట్. ఆద్యంతం సస్పెన్స్ గా సాగుతూ, చివర్లో ట్విస్టులు రివీల్ అవుతున్న తీరు ఉత్కంఠకి గురి చేస్తాయి. ఎంగేజ్ చేస్తాయి. అయితే సస్పెన్స్ అంశాలను, ట్విస్ట్ లను బలంగా రాసుకోవాల్సింది.
మొదటిభాగం ముగ్గురు ప్రేమ కథలు, వారి సమస్యలను చూపించారు. ఆ సమస్యల నుంచి బయటపడేందుకు వేసిన ప్లాన్ మరో సమస్యని సృష్టిస్తుంది. దాన్నుంచి బయటపడేందుకు వారు చేసే పనులు ఆద్యంతం సరదాగా, నవ్వులు పూయించేలా సాగుతుంది. తమని వెంటాడుతున్న కిల్లర్ నుంచి తప్పించుకునేందుకు మూడు జంటలు పడేపాట్లు నవ్వులు పూయించేలా ఉంటాయి. అదే సమయంలో ఉత్కంఠభరింతంగానూ సాగుతుంటాయి. కొన్ని బోల్డ్ డైలాగులు ఎంటర్‌టైన్ చేసేలా ఉంటాయి. దీంతోపాటు మధ్య మధ్యలో బోరింగ్ సీన్లు కూడా బాగానే ఉన్నాయి. అడవి మధ్యలో మరుగుజ్జు జాతి ప్రజలను కలిసినప్పుడు అక్కడ కామెడీ సన్నివేశాలు నవ్వులు పూయించడంతోపాటు రొమాంటిక్ సీన్లు ఆకట్టుకుంటాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ ఉత్కంఠతకి గురి చేస్తుంది.
మరోవైపు సెకండాఫ్‌లో కిల్లర్ ని ఫేస్ చేసే సీన్లు ఎంగేజ్ చేస్తాయి. ఒక్కో ప్యాంట్‌ని వెతుకుతూ వెళ్లే క్రమంలో వచ్చే సీన్లు నవ్వించేలా ఉంటుంది. కథనం సీరియస్‌గానే సాగుతుండగా, ఆడియెన్స్ కి మాత్రం అవి నవ్వించేలా ఉండటం విశేషం. వారి కష్టాలు మనకు కామెడీని పంచుతుంటాయి. మరోవైపు ప్యాంట్లని చెక్ చేసే సీన్లు సస్పెన్స్ కి గురి చేస్తుంటాయి. అదే సమయంలో అది రొటీన్‌గానూ మారుతుంది. నెక్ట్స్ ఏం జరగబోతుందో ఊహించేలా ఉంటుంది. దీంతో బోరింగ్‌గా అనిపిస్తుంది. మరోవైపు కిల్లర్ ఎక్స్ ప్రెషన్స్ మొదట్లో భయంకరంగా ఉన్నా, తర్వాత రొటీన్ ఫీలింగ్ కలుగుతుంటాయి. ప్యాంట్లలో ఏముందో ముందే తెలిసిపోవడంతో వెతికే క్రమంలో ఆ కిక్ మిస్ అవుతుంది. నెక్ట్స్ సీన్లు అర్థమైపోతుంటాయి. క్లైమాక్స్ లో ట్విస్ట్ అదిరిపోయింది. కానీ దానికున్న రీజన్ తేలిపోయింది. క్లైమాక్స్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకోవాల్సింది. అలాగే కామెడీ సన్నివేశాలపై మరింత ఫోకస్ పెట్టాల్సింది. కామెడీకి స్కోప్ ఉన్నా సరిగా వాడుకోలేకపోయారు. దీంతో అవి బలవంతపు కామెడీగా అనిపిస్తుంటాయి. చాలా సీన్లు తేలిపోయాయి. ఎంగేజ్ చేసే సీన్లు కూడా తేలిపోయాయి. కథని మరింత బలంగా రాసుకుంటే సినిమా ఫలితం ఇంకా బాగుండేది. దీంతో ఇదొక యావరేజ్ మూవీగా నిలిచింది.
ఆర్టిస్టులుః
కిల్లర్‌గా అభినవ్ సర్దార్ పాత్ర హైలైట్ గా నిలుస్తుంది. ఆయన యాక్షన్ సీన్లు అదిరిపోయాయి. భయంకరమైన లుక్‌లో అదరగొట్టాడు. `రామ్ అసుర్` తర్వాత ఆయనకు మరో మంచి పాత్ర దక్కింది. సినిమాలో ఆయనే విలన్ అయినా, హీరోయిజం చూపించేలా ఆయన పాత్ర సాగడం విశేషం. ఇక ముగ్గురు ప్రేమ జంటలు అగస్త్య(అజయ్ కథుర్వర్)- మిత్ర(ప్రియా), మహదేవ్ శర్మ(సుజిత్ కుమార్)-పార్వతి(నయన్ సారికా), కార్తిక్(తేజ ఐనంపూడి)-స్వీటి(తనియా కార్లా) తమ పాత్రల పరిధి మేరకు మెప్పించారు. శర్మ పాత్ర నవ్వించేలా ఉంటుంది. అగస్త్య పాత్ర స్టయిలీష్‌గా ఉంది. హీరోయిన్లు నటన పరంగానే కాదు, గ్లామర్‌తోనూ మెప్పించారు. రాజా రవీంద్ర, సమీర్ పాత్రలు ఓకే అనిపించేలా ఉన్నాయి.
టెక్నీషియన్లుః
కొరియోగ్రాఫర్ భరత్ కొమ్మాలపాటి దర్శకుడిగా తానేంటో నిరూపించుకునే ప్రయత్నం చేశాడు. తొలి ప్రయత్నంలో చాలా వరకు సక్సెస్ అయ్యారు. కొన్ని లాజిక్స్ మిస్ అయ్యాడు. అదే సమయంలో కథ, కథనాలను మరింత బలంగా రాసుకోవాల్సింది. దీంతో చాలా సీన్లు తేలిపోయాయి. కానీ చిన్న పాయింట్ ని రెండు గంటలు నడిపించడమంటే సాహసమనే చెప్పాలి. ఇక సినిమాటోగ్రాఫర్ హరి జాస్తి కెమెరా బాగుంది. చాలా షాట్లు బాగున్నాయి. విజువల్‌గా ఆహ్లాదాన్ని పంచేలా ఉంటాయి. ఎడిటర్ విజయ్ ముక్తావరపు తన కత్తెరకి బాగానే పని చెప్పాడనిపిస్తుంది. సంగీతం కూడా ఫర్వాలేదు. ఎంగేజ్ చేసేలా బీజీఎం సాగింది. పాటల ట్యూన్ల విషయంలో ఇంకా ఫోకస్ పెట్టాల్సింది. నిర్మాణ విలువలకు కొదవలేదు. అభినవ్ ప్రొడక్షన్ పరంగా క్వాలిటీ మెయింటేన్ చేశాడు. ఓవరాల్‌గా ఇదొక ఫర్వాలేదనిపించే సస్పెన్స్ థ్రిల్లర్.
రేటింగ్‌ః 2.5