Kranthi Review: బిగ్ బాస్ ఇనయ సుల్తానా 'క్రాంతి' మూవీ రివ్యూ

రాకేందు మౌళి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'క్రాంతి'. బిగ్ బాస్ ఫేమ్ ఇనయ సుల్తానా కూడా ఈ చిత్రం లో నటించింది.భీం శంకర్ ఈ చిత్రానికి దర్శకుడు. కాగా క్రాంతి నేడు ఆహా ఓటిటిలో విడుదలయింది.

Bigg Boss Fame kranthi movie review

ప్రముఖ రచయిత వెన్నెలకంటి కుమారుడు రాకేందు మౌళి టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, సింగర్ గా, లిరిసిస్ట్ గా రాణిస్తాన్నారు. హీరోగా కూడా గతంలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. తాజాగా రాకేందు మౌళి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'క్రాంతి'. బిగ్ బాస్ ఫేమ్ ఇనయ సుల్తానా కూడా ఈ చిత్రం లో నటించింది.భీం శంకర్ ఈ చిత్రానికి దర్శకుడు. కాగా క్రాంతి నేడు ఆహా ఓటిటిలో విడుదలయింది. థిల్లర్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులని ఆకట్టుకునే విధంగా ఉందా లేదా అనేది చూద్దాం. 

కథ: 

రామ్ (రాకేందు మౌళి) పోలీస్ ఆఫీసర్ కావాలని కలలు కనే యువకుడు. రెండు రోజుల్లో రామ్ పోలీస్ ట్రైనింగ్ కి వెళ్లాల్సి ఉండగా.. అతడి ప్రియురాలు సంధ్య( ఇనయ సుల్తానా) తన ఇంటికి వచ్చి ప్రేమ గురించి తన తండ్రితో మాట్లాడమని చెబుతుంది. రామ్ ఆమె ఇంటికి బాయలుదేరుతాడు. కానీ దారిలో ఆమె మృత దేహం కనిపించడంతో ఒక్కసారిగా షాక్ అవుతాడు. ప్రియురాలి మరణంతో రామ్ కి ఏం చేయాలో అర్థం కాదు. 

లైఫ్ విషయంలో ఎటూ తేల్చుకోలేక మనోవేధనతో కుంగిపోతాడు. మరో ఏడాది తర్వాత రామ్ తల్లికి పరిచయం ఉన్న రమ్య అనే యువతి కనిపించకుండా పోతుంది. వెంటనే కాకినాడలో పదుల సంఖ్యలో అమ్మాయిల మిస్సింగ్ కేసులు తెరపైకి వస్తాయి. అమ్మాయిల హత్యలు, మిస్సింగ్ వెనుక ఎవరి హస్తం ఉంది ? రామ్ ఎలా పోరాటం చేశాడు ? అనేది మిగిలిన కథ. 

విశ్లేషణ:

ప్రస్తుతం ఓటిటిలో ఎక్కువగా థ్రిల్లర్ కథలు వస్తున్నాయి. అయితే మెప్పిస్తున్నవి మాత్రం కొన్నే. స్త్రీలపై అత్యాచారాలు, కిడ్నాప్ లాంటి సంఘటనలతో క్రాంతి అనే చిత్రాన్ని థ్రిల్లర్ గా మలిచే ప్రయత్నం చేశారు దర్శకుడు భీం శంకర్. కొన్ని చోట్ల ప్రేక్షకులని ఆలోచింపజేసే విధంగా, ఇన్వాల్వ్ చేసే విధంగా దర్శకుడు సక్సెస్ అయ్యాడు. 

రామాయణంలో సీతాదేవిని ఎత్తుకెళ్లిన మార్గం రాముడికి తెలియకపోతే ? మహాభారతంలో ద్రౌపదిని అవమానించినప్పుడు శ్రీకృష్ణుడు లేకపోతే ? స్త్రీలపై పురాణాల్లో మొదలైన అఘాయిత్యాలు ఇంకా ఆగలేదు అంటూ హీరో చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. కొన్ని సన్నివేశాలు గతంలో కొన్ని చిత్రాల్లో చూసినట్లుగానే అనిపించినప్పటికీ ఆకట్టుకుంటాయి. 

ఇక హీరో రాకేందు మౌళి ప్రేయసిని కోల్పోయిన ప్రియుడిగా అతడి నటన చాలా బావుంది. అలాగే కథని తన భుజాలపై నడిపించిన విధానం కూడా ఆకట్టుకుంటుంది. ఇక బిగ్ బాస్ ఫేమ్ ఇనయ సుల్తానా కనిపించింది తక్కువ సమయమే అయినప్పటికీ తన పాత్రలో ఒదిగిపోయి నటించింది. 

ఈ చిత్రాన్ని తొమ్మిది రోజుల్లోనే చిత్రీకరించడం అభినందనీయం. కానీ అందువల్ల క్వాలిటీ, ప్రొడక్షన్ వాల్యూస్, అవుట్ పుట్ విషయంలో కాస్త రాజీ పడాల్సి వచ్చింది. అది సినిమాకి మైనస్ అనే చెప్పాలి. ఇన్వెస్టిగేషన్ మొదలయ్యే వరకు కథ నెమ్మదిగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది. తక్కువ టైం లో ఫినిష్ చేయాలి అనే టార్గెట్ పక్కన పెట్టి.. కాస్త టైం తీసుకుని ఉంటె ఈ చిత్రం ఇంకా బాగా ఆకట్టుకునేది. ఈ చిత్రంలో రమ్య పాత్రలో శ్రావణి.. కాకినాడ పోలీస్ అధికారిగా ఆహుతి ప్రసాద్ తనయుడు కార్తీక్ నటించారు. 

టెక్నికల్ గా:

గ్యాన్ సింగ్ అందించిన సంగీతం బావుంది. సినిమాటోగ్రాఫర్ కిషోర్ బొయిదపు పనితనం కూడా పర్వాలేదు అనే చెప్పాలి. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా ఉంది ఉంటె బావుండేది. ఇక దర్శకుడు భీం శంకర్ విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం బర్నింగ్ ఇష్యూ ని ఎంచుకుని కథ రాసుకున్నారు. 

ఇన్వెస్టిగేషన్, డైలాగులు, క్లైమాక్స్ ఆకట్టుకునేలా చూసుకున్నారు. కానీ స్క్రీన్ ప్లేని రసవత్తరంగా మార్చలేకపోయారు. అక్కడక్కడా చిన్న చిన్న లోపాలు కనిపిస్తూనే ఉంటాయి. ఓవరాల్ గా ఆయన ఎఫర్ట్ మంచిదే అని చెప్పాలి. 

ఫైనల్ గా: చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ ఓటిటిలో ఒకసారి చూడాల్సిన చిత్రమే 'క్రాంతి'.

రేటింగ్: 2.75

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios