సామజిక చైతన్య స్ఫూర్తి "నాన్న పచ్చి అబద్దాలకోరు"

సమాజానికి చైతన్య కిరణాలై నిలిచి విలువల వసంతాలు పంచాలి ..ఇలా అన్ని విలువలు కలగలిసిన కవిత్వం సురేంద్ర రొడ్డ గారి  *నాన్న పచ్చి అబద్దాల కోరు* అనే పుస్తకం రూపంలో నేటి సమాజానికి బహుమతిగా అందినది అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.

Telugu literature: Vinayakam Prakash reviews Surendra Rodda poetry

ఆదర్శవంతమైన కవిత్వం సమాజాన్ని చైతన్యవంతం చేయాలి, వ్యవస్థ మంచి మార్గం లో నడిచేందుకు  దారి చూపాలి, దారి తప్పుతున్న  యువతకు స్ఫూర్తి మంత్రం లా ఉండాలి, అనుభవాలతో అనుబంధాలపందిరి వేయించి మనసుల్ని కలిపి మహనీయం అవ్వాలి, మొత్తానికి ఆదర్శవంతంగా నిలిచే కవి అక్షరాలు సమాజానికి చైతన్య కిరణాలై నిలిచి విలువల వసంతాలు పంచాలి ..ఇలా అన్ని విలువలు కలగలిసిన కవిత్వం సురేంద్ర రొడ్డ గారి  *నాన్న పచ్చి అబద్దాల కోరు* అనే పుస్తకం రూపంలో నేటి సమాజానికి బహుమతిగా అందినది అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.

నేటి లోకం తీరు అద్దం పట్టే విధంగా వీరి రచనా శైలి మనసుల్ని  తట్టి లేపింది, అమ్మానాన్నల పట్ల ప్రేమ, భార్య భర్త ల అనుబంధం,ప్రేమమకరందాన్ని  కురిపించే కవితలు, సామాజిక చైతన్యం నింపే కవితలు మొదలైనవి మనిషి బాధ్యతలు గుర్తుచేస్తూ మనిషిని మనిషిగా బతికేటట్లుచేస్తాయి , సమాజంలో తన బాధ్యత గుర్తుచేసాయి..

Also Read: ఒక హిజ్రా ఆత్మకథ: రేవతి విషాద గాథ

కవితల శీర్షికలు సామాన్యంగా ఉన్నా వాటి అంతరార్ధం అమోఘం అద్వితీయం, పాఠకుని పరిధిలోనే కవితలు ఉన్నా కవిత చదివాక తప్పకుండా ఆలోచన సాగరం లోకి మనల్ని పంపుతాయి , పుస్తకం చదివిన తర్వాత ఖచ్చితంగా మనలో మార్పు తధ్యం.

ఇక కవితల విషయానికి వస్తే వైవిధ్యమైన శీర్షికతో పాఠకుని మనస్సు దోచుకుంటాయి..కవితా శీర్షిక, ఎత్తుగడ, శిల్పం, అంతరార్థం, భావవ్యక్తీకరణ, కొనసాగింపు, ముగింపు చాలా ఆదర్శంగా ఉంది.

నేటి సమాజంలో ఆడబిడ్డలపై అత్యాచారాలు పెరిగిపోయాయి అత్యాచార బాధితుల బాధలు కళ్లకు కడుతూ సురేంద్ర రొడ్డ గారు రాసిన కవిత చదివితే  కన్నీరు ఆగవు.

 *తెగిన అంగాలు కుట్టుకుంటూ
గాయపడ్డ దేహాన్ని ఈడ్చుకుంటూ
ఓదార్పు స్పర్శకోసం అన్వేషిస్తూ
వేదనల గేయాన్ని ఆలపిస్తూ*

అంటూ అత్యాచార బాధితురాలి ఆవేదనను దీన స్థితిని *శిధిలాలయం* కవితలో వివరిస్తూ. నేటి సమాజంలో అత్యాచారం అనే దుర్మార్గపు చేష్టలకు బాద్యులైన మగపిల్లల తల్లిదండ్రులను తన కవిత *ఇప్పుడెందుకు ఏడుస్తారు* లో ఈ విధంగా ప్రశించారు

Also Read: అతడి కవిత, ‘ఇనుప గజ్జెల తలరాత’

"గడ్డాలోచ్చిన బిడ్డలు గాడి తప్పారని ఇప్పుడెందుకు ఏడుస్తారు..! పసిడి పొత్తిళ్ళలో నీతికథలు చెప్పి,నైతిక విలువలతో పెంచకుండా ఫోన్ కొనిచ్చి,చెడు మార్గాలలో నడిపించి..ఇప్పుడు దారి తప్పిన తర్వాత మీరు ఏడిచి ఏమి లాభం "అంటూ వారిని ఘాటుగా ప్రశించారు.

నేటి భారత మాత మౌన రోధనను తన కవిత *ఎడవకమ్మా ...ఏడవకు !* ద్వారా కళ్ళకు కట్టారు.స్వపరిపాలనలో దేశం ఏడుస్తోందని,విలువలు తగ్గిన సమాజాన్ని చూసి, రైతుల రోదనలు చూసి,ఓటుకోసం ఇస్తున్న నోటు చూసి భారతావని కన్నీరు కారుస్తుంటే..ఏనాటికైనా వివేకానంద,నేతాజీల స్ఫూర్తితో దేశ యువత దేశమాత కన్నీరు తుడుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

Also Read: చింతన 1: రూపమూ ప్రక్రియా- కవిత్వం

మధ్య తరగతి నాన్న తన బిడ్డల కోసం పడిన తాపత్రయం నాన్న పచ్చి అపద్దాల కోరు ద్వారా వివరించిన వైనం అమోఘం అద్వితీయం.

నాన్న పడ్డ అగచాట్లు తెలిసిన ఏకైక ప్రాణి అమ్మ అని "అమ్మకు చెప్పకురా" అనే కవితలో బాధ్యత గల నాన్న కుటుంబం కోసం పడే తాపత్రయం గురించి వివరించారు.

అనాదిగా ఆటబొమ్మ, అమ్మకోక,తాళిబంధం,అర్ధాంగి కవితల ద్వారా  కవికి స్త్రీలపై గల గౌరవాన్ని  చెప్పకనేచెబుతాయి.ఆడవారువారి సమస్యలపై సురేంద్ర గారి కవితలు అక్షర తూటాలుగా పేలాయి.

రైతు, నిరుద్యోగి, గర్భస్రావం అయిన మహిళల బాధలు కన్నీటి మాటలను "ఇరిగిపోవే కన్నీటిచుక్కా..! '' ద్వారా వివరించిన వైనం బాగుంది.

ఇంకా చాలా కవితలు బాగున్నాయి , వీరి కవితల్లో సామాజిక బాధ్యత, ఆడపిల్లల  చదువుకోసం, వారి గౌరవం కోసం ఆరాటం, కుటుంబం ఆవశ్యకత, తల్లిదండ్రుల ప్రేమ ను ఈ తరం కఠినంగా మారుతున్న యువతకు చక్కగా నేర్పుగా అర్థము అయ్యేవిధంగా సరళమైన పదాలతో చెప్పి ఆదర్శంగా నిలిచారు సురేంద్ర రొడ్డ గారు.

వీరు గౌరవప్రదమైన  ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ అటు వారి శిష్యబృందాన్ని ,ఇటు కవితలు రచనల ద్వారా సమాజాన్ని మంచి మార్గం లో నడిపిస్తున్నారు.

వీరి అద్భుతమైన కలం  నుంచి మరెన్నో ఉత్తమ రచనలు రావాలని సమాజంలో ఆరోగ్యకర మార్పు తీసుకురావాలని కోరుకుంటూ కవికి మరోమారు హృదయపూర్వక శుభాభినందనలు..

- వినాయకం ప్రకాష్

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios