ఒక హిజ్రా ఆత్మకథ: రేవతి విషాద గాథ
"ఒక హిజ్రా ఆత్మకథ" రేవతి గారి విషాద జీవిత గాధ. మొట్టమొదటి సారిగా హిజ్రాల గురించి రాసిన పుస్తకం. దీన్ని సత్యవతి గారు తెలుగులోకి అనువదించారు. ముఖ్యంగా ఆత్మకథ చదివుతున్నపుడు వారి గురుంచి మాత్రమే అర్ధం చేసుకునేవిగా రాయబడుతాయి,
"ఒక హిజ్రా ఆత్మకథ" రేవతి గారి విషాద జీవిత గాధ. మొట్టమొదటి సారిగా హిజ్రాల గురించి రాసిన పుస్తకం. దీన్ని సత్యవతి గారు తెలుగులోకి అనువదించారు. ముఖ్యంగా ఆత్మకథ చదివుతున్నపుడు వారి గురుంచి మాత్రమే అర్ధం చేసుకునేవిగా రాయబడుతాయి, కానీ ఇందులో పూర్తిగా హిజ్రాల జీవనవిధానాలు, ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, వాళ్ళు ఎదుర్కొంటున్న వివక్ష, సమాజంలో వాళ్లకు స్థానమే లెనట్టుగా అవహేళన, చిన్నచూపు చూసే ప్రజాలనుండి, కనీసం వీళ్ళు మనుషులే అని ప్రభుత్వాలు సైతం గుర్తించని స్థితి నుండి నిరంతర పోరాటాలు, ఎన్నో ఉద్యమాల ద్వారా వాళ్ళు సాధించుకున్న హక్కులు చదువుతుంటే అబ్బుర పరుస్తాయి.
Also Read: అతడి కవిత, ‘ఇనుప గజ్జెల తలరాత’.
తమిళనాడు లోని మారు మూల పల్లెలో హిందూ కుటుంబంలో 'దొరైస్వామి' అనే పేరుతో పురుషుడిగా పుట్టినప్పటికీ, అతనిలో హార్మోన్ల ప్రభావంతో స్త్రీగా జీవితం గడపాలని వాళ్ళ అమ్మ, అక్కల వలే కట్టు, బొట్టు, నడత,నడక ఉండాలని నిరంతరం అంతర్ సంఘర్షణలకు లోనవుతూ, ఎవరితోను తన బాధను పంచుకోలేక తనలోని స్త్రీని చంపుకోలేక బిక్కుబిక్కుమంటూ గడిపిన బాల్యపు క్షణాలలో ఊళ్ళో జరిగిన జాతర ఉత్సవాల్లో అతనికి ఆడ వేషం వేసే అవకాశం దొరకడంతో అతనికి సంతోషం కలుగుతుంది. అది తెలుసుకున్న కుటుంబ సభ్యులు కొంత బాధపడ్డా వేషం బాగా కుదిరింది అని ఊరి ప్రజలు మెచ్చుకోవడంతో సంతోష పడతారు.
పదవ తరగతి తరువాత నా లాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటారా లేక ఈ పాడురోగం నా ఒక్కడికేనా అని మదన పడుతున్న సందర్భంలో ఒక గుట్టపైన హిజ్రాలను కలిసి ఆడ వేషం వేస్తే అచ్చం సినిమా హీరోయిన్ 'రేవతి' లా ఉన్నవాని పొగిడితే తన పేరు రేవతి అని మానసికంగా ఫిక్స్ అయ్యి వాళ్లతో గడిపి ఆనందపడేవాడు. ఇది తెలుసుకున్న నాన్న, అన్నలు దేహశుద్ది చేసి చదువు మాన్పించి పనిలో పెట్టుకోవడం, అక్కడినుండి తప్పిచుకొని తల్లి దాచుకున్న డబ్బులు, రెండు చీరలతో ఢిల్లీ వెళ్లి హిజ్రాల చిరునామా కనుకొని వాళ్లలో కలిసిపోయి బ్రతకుతూ, లింగ మార్పిడి(నిర్వాణం) చేయుంచుకొని ఆర్ధిక, ఆరోగ్య సమస్యలతో తను పడ్డ అవస్థలు ఒకింత కంటనీరు పెట్టిస్తాయి.
Also Read: చింతన 1: రూపమూ ప్రక్రియా- కవిత్వం
ఇక్కడ ముఖ్యంగా హిజ్రా వర్గంలో 'చేలా' గా చేరి వాళ్ళ 'గురుబాయి' లతో సాంగత్యం వాళ్ళు వాడే పదాలు, మొక్కే దేవుళ్ళు, చేసే వేడుకలు కొత్త సంస్కృతి సంప్రదాయాలు, పాటిస్తున్న నియమ నిబంధనలు వింతగా అనిపిస్తాయి. కుటుంబ సభ్యులను చూడాలని వచ్చినప్పుడు జరిగిన దేహశుద్ది, అవమానాలు మళ్ళీ తిరిగి ముంబై వెళ్లడం వేశ్య వృత్తిలో పడ్డ కష్టాలు, వచ్చిన డబ్బుల్లో మిగిలినవి ఇంటికి పంపిస్తే వాళ్ళ నాన్న డబ్బును ఇష్టపడతాడే కానీ ఈమెను ఇంట్లో ఉంచుకోవడం ఇష్టపడడు
"మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే" అన్నటువంటి మార్క్స్ మహనీయుని మాటలు అక్షర సత్యంలా అనిపిస్తాయి. సంగమ అనే NGO లో ఉద్యోగినిగా చేరి తమ హక్కులకై ఉద్యమిస్తూ, అక్కడ తన కంటే పై ఆఫీసర్ తో ప్రేమ లో పడి పెళ్లి చేసుకొని సంవత్సరం తిరుగకముందే అతను వదిలిపెట్టడం మళ్ళీ ఒంటరిగా సెక్స్ వర్క్ చేద్దామంటే క్లయింట్ దొరకక తిండికి లేక మళ్ళీ ఉద్యోగంలో చేరి ఎంతో మంది హిజ్రాలతో ఇంటర్వ్యూ లు చేసి పుస్తకాన్ని తయారు చేయమనే పనిని సంస్థ కలిపించడం తో "ఉనర్వుమ్ ఉరువమ్" పేరుతో తమిళంలో వచ్చిన తన జీవిత గాధ ఇంగ్లీషు లో అనువదించబడింది అటు తర్వాత తెలుగులోకి అనువదించారు.
Also Read:పుస్తక సమీక్ష: బహుజనుల బతుకుగోస 'ఆళ్లకోస'.
సమాజంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్న హిజ్రాలకు మొదటి సారిగా 1994లో ఓటు హక్కు కల్పించబడినది. Shabnam "Mausi" Bano అనే హిజ్రా మధ్యప్రదేశ్ నుండి MLA(1998-2003) గా ఎన్నుకోబడ్డారు. Joyita mondal అనే హిజ్రా 2017లో వెస్ట్ బెంగాల్ నుండి లోక్ అదాలత్ లో జెడ్జ్ గా నియమించబడ్డారు. Prithika yasini అనే హిజ్రా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్(SI) గా విధులు నిర్వహిస్తున్నారు. Manabi bandopadyaya అనే హిజ్రా philosophy లో Phd చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉన్నారు. Shabi అనే హిజ్రా ఇండియన్ నేవి లో solider గా విధులు నిర్వర్తిస్తున్నారు. 2018 సం"లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో "చంద్రముఖి" అనే ట్రాన్సజెండర్ కు బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (BLF) తరుపున హైదరాబాద్ లోని గోషామహల్ నియోజకవర్గం నుండి MLA టిక్కెట్ ఇచ్చి, ఎన్నికల్లో అన్ని ప్రజా సంఘాల మద్దతుతో ముందుకు కొనసాగినా ఓటమి పాలైనప్పటికీ నైతికంగా విజయం సాధించింది.
ఈమె ఆత్మకథ చదివిన తర్వాత హిజ్రాలపై పూర్వం ఉన్న దురభిప్రాయలు తొలిగిపోయి, వాళ్ళను మనుషులుగా గుర్తించాలనే భావం కలగడంతో పాటు వాళ్ళను అవమానించకుండా సాటి మానువులుగా గుర్తించగలరు.అందరూ తప్పకుండా చదవాల్సిన పుస్తకం.
- ముఖేష్ సామల