సమాజ మాగాణిలో చైతన్య *మొలక* "
భానుశ్రీ కోత్వాల్ కవిత్వాన్ని వినాయకం ప్రకాశం విశ్లేషించారు. ఆమె కవిత్వం గురించి వినాయకం ప్రకాశ్ వివరించారు. ఏషియా నెట్ న్యూస్ లో తప్పక చదవండి.
మానవీయ విలువలు , అనుబంధాలు ,నైతికత పతనం అవుతూ ప్రమాదపు టంచున ఉన్న నేటి సమాజంలో తన అక్షరాలతో సమాజంలోని సమస్యలపై అలుపెరగని అక్షర పోరాటానికి నాంది పలికారు కవయిత్రి భానుశ్రీ కొత్వాల్ గారు.
మహిళలపై వివక్షను,హింస అన్యాయాలనీ ,అరాచకాలనుప్రశిస్తూ, సమాజంలోని రకరకాల పోకడలను అన్యాయాన్ని తనదైన శైలిలోవివరిస్తూ మార్పు కోసం తపించారు కవయిత్రి.
వారి కవితల్లో ఆప్యాయతను కుమ్మరిస్తూ, అనుబంధాలను కలుపుతూ, చక్కని పదబంధాల సహాయంతో, వర్ణనలతో తన అక్షరాలతో నూతన విప్లవానికి దారి తీశారు.ఈ పుస్తకంలో కవితా శీర్షికలు వైవిధ్యభరితం, ప్రతి కవిత సమాజహితంతో రాశారు, అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చిన తీరు అమోగం,
తన అద్భుతమైన కవితల ద్వారా సమాజంలో గుణాత్మక మార్పు తేవడానికి కవయిత్రి గారు ఎంతో శ్రమించారు.
Also Read: మట్టి మనసులో వెలుగు నక్షత్రాలు వేణు కథలు
ఒకసారి మనం వారి కవితా శీర్షికలు చాలా వైవిధ్యంగా ఉన్నాయి అందులో జీవనతంత్రి, విజయపథం, బాల్యమా నీ పరిమళం ఎక్కడ..??, సిరియానేనే పచ్చని చెట్టు అయితే, కాలిపోతున్న మానవత్వం ఆమె ,మా ఊరి కల్పవల్లి నెత్తుటి సాక్ష్యం మొదలైన కవితల భావం చాలా ఆదర్శంగా ఉంది.
*నా కవిత్వం* అనే కవితలో "కదులుతున్న కాలంలో జారిపోయే స్మృతులకు ఆనకట్ట నా కవిత్వం అంటారు.ఈ అక్షరాలు కవయిత్రి లోని అక్షరావేశాన్ని ప్రతిభింబిస్థాయి..
మరో కవిత" సమసమాజ మా..??"అనే కవిత లో *కలాలకు పదును పెట్టి గుట్టలుగా నింపుతున్నాం పదునుగా ప్రశ్నిస్తున్నామా?*
అంటూ నేటి ఆధునిక కవుల వైఖరిని చక్కగా ప్రశ్నించారు పౌరుల బాధ్యతను గుర్తుచేశారు కవయిత్రి.
అనాధ శిశువులు, ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలను అరాచకాలను కళ్లకు కట్టినట్టు ప్రశ్నిస్తూ కవిత్వీకరించారు.
జీవశిల అనే కవితఅత్యాచారానికి బలైపోయిన ఆడబిడ్డ పై ఆధిపత్యమును చక్కగా వివరించారు
**బలహీనుల బలహీనతపై*
*నోట్లు చల్లి*
*మీసం తిప్పడం*
*నేటి న్యాయం**
అంటూ తనదైన శైలిలో అరాచకాన్ని ప్రశ్నించారు.
అమ్మ కొంగు కవిత ద్వారా మాతృమూర్తి యొక్క ప్రేమను చక్కగా వివరించారు,గోరింటాకు కవిత ద్వారా అమ్మాయి మనస్సు మృగారణ్యం ద్వారా చిన్నారుల పై అఘాయిత్యాలు వివరిస్తూ ప్రశ్నించారు. నేటి సోషల్ మీడియా అరాచకాలను దాని వల్ల కలిగే దుష్పరిణామాలను తన మొలక ద్వారా వివరించారు.
Also Read: మట్టి మనసులో వెలుగు నక్షత్రాలు వేణు కథలు
నేటి సమాజంలో అత్యంత దయనీయ స్థితిలో ఉన్నది వృద్ధులు వారి యొక్క బాధలను ఎంతో చక్కగా హృదయముద్రవించేలా కాయ తీగ భారమా అనే కవితలో చక్కగా వివరిస్తూ..వృద్ధుల ఉద్దేశించి
*ఒంగిన నడుముకు ఊతమవ్వు*
*వినలేని చెవులకు సంగీతమవ్వు*
*పొడిబారిన పెదాలకు చిరునవ్వునద్దు* - అంటూ చక్కగా వృద్దులపై మన బాధ్యతను గుర్తుచేశారు.
నేడు చెరువులు నానాటికి అంతరించిపోతున్నాయి, ప్రకృతి నాశనము అయిపోతోంది ఈ సమయంలో చెరువును కవయిత్రి మా ఊరి కల్పవల్లిగా, అమృతభాండం గా,అమ్మ ప్రేమ ఆర్తి గా వివరించిన తీరు ఎంతో బాగుంది, కవయిత్రి తనను తాను చెట్టు గా భావించి తాను చేసే సమాజ సేవ గురించి ఆద్యంతం చక్కగా వివరించారు
నేటి సమాజంలో బాధపడుతున్న వర్గాలలో ముఖ్యమైనది బాల్యంనేడు బాల్యండిజిటల్ వెలుగుల్లో నలిగిపోతూ ర్యాంకుల బరిలో పందెంకోడై పెరుగుతూ శైశవం ఒత్తిడిలో కుచించుకుపోతూ అల్లాడుతోంది అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ మొలక కవితా సంపుటి ముఖచిత్రం కూడా చాలా వైవిధ్యం గా ఉంది. 56 కవితలు కూడా సామాజిక స్పృహతో నవ సమాజ నిర్మాణానికి నాంది పలుకుతాయి అనడంలో సందేహం లేదు...చలా కవితలు ఆత్మీయతను, బాధ్యతను గుర్తుచేస్తూ,,ఆడవారిపై చిన్న పిల్లలపై జరిగే అరాచకాన్ని ప్రశించాయి..
Also Read: జీవితాలను పెనవేసుకున్న దండకడియం
*మొలక* పుస్తకం చదవడం ద్వారా మనిషికివ్యక్తిగతంగా సమాజ పరంగా ఆరోగ్యకరమార్పు తధ్యం.ఈ పుస్తకం రాబోయే తరాలకు స్ఫూర్తి పంచుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.భానుశ్రీ కొత్వాల్ గారు ఇంకెన్నో మంచి రచనలు చేసి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆశిస్తున్నాను..
- వినాయకం ప్రకాష