సాదత్‌ హసన్‌ మంటు కథల సంపుటి - అనార్కలి - ఆవిష్కరణ సభ ఈరోజు సాయంత్రం 6 గంటలకు రవీంద్ర భారతి కాన్ఫరెన్స్‌ హాల్‌లో జరుగుతుంది.

సాదత్‌ హసన్‌ మంటు కథల సంపుటి - అనార్కలి - ఆవిష్కరణ సభ ఈరోజు సాయంత్రం 6 గంటలకు రవీంద్ర భారతి కాన్ఫరెన్స్‌ హాల్‌లో జరుగుతుంది. అనువాదకుడు అమ్జద్‌తో పాటు పుస్తక ఆవిష్కర్త జూలూరి గౌరీశంకర్‌, ఏనుగు నరసింహారెడ్డి, ఏ.కె. ప్రభాకర్‌, కవి యాకూబ్‌, అబ్దుల్‌ వాహెద్‌, రాపోలు సుదర్శన్‌, రూప్‌కుమార్‌ డబ్బీకార్‌ సభలో ప్రసంగిస్తారు. నిర్వహణ అభ్యుదయ రచయితల సంఘం, తెలంగాణ రాష్ట్ర శాఖ, పాలపిట్ట బుక్స్.

మూడు గుడిసెల పల్లె ఆవిష్కరణ : 
డా. సిద్దెంకి యాదగిరి కథా సంపుటి ‘మూడు గుడిసెల పల్లె’ పుస్తకావిష్కరణ రేపు అనగా 17 మార్చి 2023 న సాయంత్రం 5:30గం.లకు రవీంద్ర భారతి మినీ హాల్, హైదరాబాద్ లో జరుగుతుంది. 

మంజీర రచయితల సంఘం జిల్లా అధ్యక్షులు కె. రంగాచారి సభాధ్యక్షత వహించే ఈ సభకు విశిష్ట అతిధి కూర రఘోత్తం రెడ్డి, ముఖ్యఅతిథులు డా.నందిని సిద్ధారెడ్డి, దేశపతి శ్రీనివాస్. అతిథులు దేవిప్రసాద్, విరహత్ ఆలీ. డా. కొలకలూరి ఇనాక్ ఆవిష్కరించే ఈ కథల సంపుటిని తైదల అంజయ్య, పొన్నాల బాలయ్య,
గుడిపల్లి నిరంజన్ లు సమీక్ష చేస్తారు. నిర్వహణ మంజీరా రచయితల సంఘం.