Asianet News TeluguAsianet News Telugu

మహిళలు జాగ్రత్త! ఎక్కువగా ఫోన్ ఉపయోగిస్తే.. అంతే సంగతులు..

Mobile Phones:  సెల్ ఫోన్ లేని జీవితాన్ని ఊహించడం కష్టంగా మారింది. ఉదయం లేచిన మొదలు ప్రతి ఒక్కరు కూడా రాత్రి పడుకునే వరకు కచ్చితంగా మన దగ్గర ఉండాల్సిందే. ఒక్క మాటలో చెప్పాలంటే.. జీవితంలో సెల్ ఫోన్ పార్టుగా మారిపోయింది.  అయితే.. దాని అతిగా ఉపయోగిస్తే.. అంతే సంగతి అంటా..

Women are more addicted to their smartphones than men, Heres what you need to know KRJ
Author
First Published May 24, 2024, 9:36 PM IST

Mobile Phones: కాలం మారింది, మారుతున్న కాలానుగుణంగా టెక్నాలజి కూడా పెరిగిపోతుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి మొదలుకుని ముసలివారివరకు ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ వినియోగిస్తన్నారు. తెల్లవారుజాము నుంచి మొదలుకుని రాత్రి నిద్రపోయేవరకు స్మార్ట్ ఫోన్ లో ప్రపంచాన్ని చూసేస్తున్నారు.

ఉదయం నుంచి రాత్రి వరకు తినడం, పడుకోవడం, నిద్రపోవడం, నీరు త్రాగడం ఎలాగైతే చేస్తామో అలాగే ఫోన్ కూడా జీవితంలో ఒక భాగమైపోయింది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ వల్ల ఎంత మంచి ఉందో, అంత చెడు కూడా ఉంది. అత్యధికంగా మొబైల్ వాడటం వలన చాలామంది అనారోగ్యం బారిన పడుతున్నారు. 

రోజంగా కంటిన్యూగా మొబైల్ వాడితే దాన్ని మొబైల్ అడిక్షన్ అని పిలుస్తారు. ఇలాంటి అలవాటు కారణంగా చాలా మంది ఎన్నో నష్టాలను చవిచూస్తున్నారు. మొబైల్ వినియోగిస్తూ ఎక్కువ సేపు ఒకే పొజిషన్ లో ఉంటే ఎన్నొ సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా మహిళలకు గర్భాశయ సమస్యలను ఎదురయ్యే సమస్యలు ఉన్నాయి.

దాంతో పాటుగానే ఎముకలకు సంబంధించిన సమస్యలు, భుజాలు, మెడ, తలనొప్పితో పాటు వీపులో కూడా నొప్పి సంభవించవచ్చు. ముఖ్యంగా మహిళలకు వచ్చే గర్భాశయ నొప్పి కారణంగా  లేవడం, కూర్చోవడం కష్టంగా మారే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది మొబైల్ ఉపయోగిస్తూ రిలాక్స్డ్ అవుతుంటారు. అలా కావడం ద్వారా శరీర పటుత్వం కోల్పోతారు. అంతే కాకుండా మహిళలకు సంతానలేమి సమస్యలు కూడా వస్తున్నాయి.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios