ఎప్పుడైనా ఆలోచించారా..?  మీ పిల్లల స్కూల్ బస్సు పసుపు రంగులోనే ఎందుకు..?  

స్కూల్ బస్సులు పసుపు రంగులోనే ఎందుకుంటాయి..? దాని వెెనక దాగివున్న సైన్స్ ఏమిటి ? విద్యార్థుల భద్రతతో దీనికేమైనా సంబంధం వుందా ? 

Why are school buses painted with yellow colour? AKP

హైదరాబాద్ : భారత్ లోనే కాదు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా స్కూల్ లేదా కాలేజీ బస్సులు పసుపు రంగులోనే వుంటుంది. అయితే విద్యార్థులు ప్రయాణించే బస్సులకు ఇలా పసుపు రంగే ఎందుకు వేస్తారు..? దీని వెనకున్న రహస్యం ఏమిటి? అని ఎప్పుడైనా ఆలోచించారు.  అయితే  విద్యార్థులు ప్రయాణించే వాహనాలు ఇలా పసుపు రంగులో వుండటం వెనక సైన్స్ దాగివుంది. అదేంటంటే... 

సాధారణంగా మన ప్రకృతిలోని ఒక్కో రంగు ఒక్కో ప్రత్యేకతను కలిగివుంటాయి. కొన్ని రంగులు మన కళ్లకు చాలా దూరంనుండి, చీకట్లోనూ కనిపిస్తుంటాయి. అలాంటి రంగుల్లో ఒకటే పసుపు. ఈ విషయంలో ఎరుపు మొదటిస్థానంలో వుండగా ఆ తర్వాత పింక్, ఎల్లో కలర్స్ వుంటాయి. అయితే ఎరుపు రంగును డేంజర్ కు సింబల్ గా వాడతారు. కాబట్టి దీన్ని స్కూల్ బస్పులకు వాడలేం. ఇక మిగిలింది పింక్, ఎల్లో. పింక్ కూడా రెడ్ కలర్ ను పోలినట్లే వుంటుంది కాబట్టి పసుపు రంగును విద్యార్థులను తరలించే వాహనాల కోసం ఉపయోగిస్తున్నారు. 

విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని విద్యాసంస్థల వాహనాలన్ని పసుపు రంగులో వుంటాయి. దూరం నుండి కూడా పసుపు స్పష్టంగా కనిపిస్తుంది... కాబట్టి ప్రమాదాలు జరిగే అవకాశం తక్కువగా వుంటుంది. అలాగే వర్షం, పొగమంచు లోనూ పసుపు రంగులోని వాహనాలు సులభంగా కనిపిస్తాయి. వాతావరణ పరిస్థితులు ఎలావున్నా స్కూల్ వాహనాలు విద్యార్థులను తరలించాల్సి వుంటుంది. కాబట్టి ప్రమాదాలను నియంత్రించేందుకు విద్యాసంస్థల వాహనాలు పసుపురంగులో వుంటాయి. 

సైన్స్ ఏం చెబుతోంది :

ప్రతి రంగుకు ఓ తరంగధైర్ఘ్యం వుంటుంది. అధిక తరంగదైర్ఘ్యం కలిగిన రంగుల కంటే తక్కువ తరంగదైర్ఘ్యం కలిగిన రంగుల్లో పోటాన్లు వాతావరణంలో చెల్లాచెదురుగా ప్రయాణిస్తాయి. కాబట్టి ఇవి గాలిలోని అణువల వల్ల ఎక్కువగా వక్రీభవనం చెందుతాయి... కాబట్టి ఆ రంగులు మన కంటికి అంత స్పష్టంగా కనిపించవు. అదే ఎక్కువ తరంగదైర్ఘ్యం కలిగిన రంగుల చాలా తక్కువ  వక్రీభవనం చెందుతాయి... కాబట్టి అవి మన కంటికి స్పష్టంగా కనిపిస్తాయి. 

ఎరుపు రంగు అత్యధికంగా 700 తరంగధైర్ఘ్యం కలిగివుంటుంది.  ఆ తర్వాత నారింజ 600, పసుపు 580 తరంగదైర్ఘ్యాన్ని కలిగివుంటాయి.  తరంగధైర్ఘ్యం తగ్గుతున్న కొద్ది మన కంటికి రంగులు స్పష్టంగా కనిపించడం కూడా తగ్గుతుంది. కాబట్టి అత్యధిక తరంగదైర్ఘ్యం గల రంగుల్లో పసుపు ఒకటి... ఇది మన కంటికి స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టే స్కూల్, కాలేజీ బస్సులు, ఇతర వాహనాలకు ఉపయోగిస్తారు. 

 
 

 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios