అపర చాణక్యుడు వందల యేళ్ల క్రితమే జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను వివరించి చెప్పాడు. చాణక్యుడు చెప్పిన ప్రతి విషయం కూడా మన జీవితాన్ని ఎంతో మెరుగుపరిచే విధంగానే ఉంటాయి. భార్యాభర్తల మధ్య వయసు తేడా గురించి కూడా అతని వివరించాడు.

చాణక్యుడు మనిషి జీవితానికి సంబంధించిన విషయాలను ముందుగానే ఊహించి వివరించాడు. ఆర్థిక విషయాలను తెలియజేస్తూ అర్థశాస్త్రాన్ని రచించాడు. అతడు చెప్పిన ప్రతి మాటను తూచా తప్పకుండా పాటిస్తే ఖచ్చితంగా ఒక వ్యక్తి జీవితంలో విజయం సాధిస్తాడు. భార్యా భర్తలు ఆనందంగా ఉండేందుకు చాణక్యుడు ఎన్నో సలహాలు చెప్పాడు. అలాగే వివాహ విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోమని వివరించాడు. అలాంటి వాటిల్లో భార్యాభర్తల మధ్య వయసు తేడా కూడా ఒకటి.

ఆధునిక సమాజంలో ఎన్నో మార్పులు వచ్చాయి. భర్త కన్నా భార్య పెద్ద వయసు ఉండడం కూడా మనం చూస్తూనే ఉన్నాము. అలాగని అన్ని అనుబంధాలు విజయవంతం అవ్వాలని లేదు. అయితే భార్యాభర్తల మధ్య ప్రేమ అనురాగం కలకాలం ఉండాలంటే చాణక్యుడు వారి మధ్య వయసు తేడా ఎంత ఉంటే మంచిదో వివరించాడు. అలా ఆ వయసు తేడాతో ఉన్న భార్యాభర్తల మధ్య అనుబంధం ఎంతో ఆరోగ్యంగా ఉంటుందని, వారు జీవితాంతం కలిసే ఉంటారని చెబుతున్నాడు చాణుక్యుడు.

చాణక్యుడు చెప్పిన ప్రకారం భార్యాభర్తల మధ్య వయసు తేడా తక్కువగా ఉండకూడదు. అలాగని మరీ ఎక్కువగా కూడా ఉండకూడదు. వారిద్దరి మధ్య వయసు తేడా ఎక్కువ ఉన్నా కూడా వారి జీవితంలో ఎన్నో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వివాహం అయ్యాక వారిద్దరికీ సరిపడకపోతే ఆ పరిస్థితిని చక్కదిద్దడం కూడా కష్టంగా మారిపోతుందని ముందే చాణక్యుడు వివరించాడు. చాణక్యుడు చెబుతున్న ప్రకారం ఒక వృద్ధుడు ఎప్పుడూ కూడా యువతిని వివాహం చేసుకోకూడదు. తన వయసుకు తగ్గ వ్యక్తినే వివాహం చేసుకోవాలి.

ఎంత వయసు తేడా ఉండాలి?

చాణక్యుడు చెప్పిన ప్రకారం భార్యాభర్తల మధ్య వయసు తేడా అధికంగా ఉంటే వారి బంధం త్వరగానే ముగిసిపోతుంది. భర్త వయసు మరీ అధికంగా ఉంటే... ఆ భార్య జీవితం అల్లకల్లోలంగా ఉంటుంది. ఆమె వైవాహిక జీవితం పై ఆసక్తిని కోల్పోతుంది. వారి అనుబంధం ఎక్కువ కాలం కొనసాగదు. భార్యాభర్తల మధ్య వయస్సు తేడా ఎప్పుడైనా మూడేళ్ల నుంచి 5 ఏళ్ల లోపు మాత్రమే ఉండాలి. అప్పుడే వారి మధ్య అనుబంధం పటిష్టంగా ఉంటుంది.

చాలామంది భార్యాభర్తల మధ్య పదేళ్ల తేడా కూడా ఉండడం చూసే ఉంటారు. ఇంత వయసు తేడా వారి ఆలోచనల మధ్య దూరాన్ని పెంచేస్తుంది. ఒకరు చలాకీగా ఉంటే, మరొకరు స్తబ్దంగా ఉంటారు. కాబట్టి పదేళ్ల వయసు తేడాతో ఎవరికీ పెళ్లిళ్లు చేయకపోవడమే ఉత్తమం.

ఒకరి కోసం ఒకరు

పెళ్లి అనేది ఒక మనిషికి జీవితాంతం దొరికే ఒక తోడు. ఇందులో ఒకరిని ఒకరు చూసుకునే శక్తిని కలిగి ఉండాలి. ఒకరిపై ఒకరు ఆధారపడి జీవించాలి. ఒకరికి అనారోగ్యం వచ్చినా... మరొకరు సేవ చేసే వయసులోనే ఉండాలి. అందుకే వయసు తేడా మూడు నుంచి ఐదు ఏళ్ల మధ్యనే ఉండాలని చాణక్యుడు చెప్పాడు. అలాంటి వయసు తేడాతో పెళ్లి చేసుకుంటే ఆ భార్య భర్తలు ప్రేమగా ఉంటారని, వారి మధ్య వయసు తేడా వారిపై ఎలాంటి ప్రభావాన్ని చూపించదని వివరిస్తున్నాడు చాణక్యుడు.

సమాన వయసులో వారు పెళ్లాడితే

ఎంతోమంది కలిసి చదువుకొని పెళ్లి కూడా చేసుకుంటారు. అంటే ఒకే వయసు గల వ్యక్తులు పెళ్లి చేసుకోవడం అన్నమాట. ఇలా ఒకే వయసు గల వ్యక్తులు ఒకేలాంటి దూకుడును, ఆలోచనలను, మనస్తత్వాన్ని కలిగి ఉండే అవకాశం ఉంది. అలాంటి సమయంలో ఇద్దరు దూకుడుగా ఉంటే వారి బంధం వీగిపోవచ్చు. కాబట్టి కాస్త వయసు తేడా ఉండాల్సిన అవసరం ఉంది. ఇద్దరి ఆలోచనలు చురుగ్గా ఉంటే వారు నిర్ణయాలు అతి త్వరగా తీసుకుంటారు. కాబట్టి వయసు అంతరం అనేది వారి ఆలోచనలను కూడా ప్రభావితం చేస్తుంది. ఒకరు చురుకుగా ఉంటే.. మరొకరు ఆ చురుకుదనాన్ని, దూకుడును తగ్గించే విధంగా ఉంటారు. కాబట్టి భర్త భార్య కన్నా మూడేళ్లు నుంచి ఐదేళ్ల వరకు పెద్దగా ఉంటే ఆ కుటుంబం ఆనందంగా సాగుతుంది.