బరువు తగ్గాలని... నాజుకుగా కనిపించాలని అందరూ కోరుకుంటారు. ముఖ్యంగా పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి చాలా మంది  చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే... ఒక్క సింపుల్ ట్రిక్కుతో పొట్ట దగ్గర కొవ్వు తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

మీరు తీసుకునే ఆహారంలో చెక్కరను పూర్తిగా దూరం చేయాలి. ఇలా చేయడంతో మీరు సగం విజయం సాధించినట్లే లెక్క. దీంతోపాటు ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని ముఖ్యంగా ఫైబర్ ఉండే ఆహారాలు తినాలి.వీటి కారణంగా త్వరగా ఆకలి వేయదు. తద్వారా బరువు తగ్గవచ్చు. ఆ ఆహారంలో ఉండే ఫైబర్ శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది.

టీ తాగడం వల్ల శరీరంలోని కొవ్వు ను కరిగించవచ్చు. చెక్కర తక్కువగా ఉండేలా జాగ్రత్త పడుతూ టీ తాగాలి. టీలో ఉండే కాచెటిన్స్ జీవక్రియను మెరుగుపరుస్తాయి. కొవ్వును త్వరగా కరిగిస్తాయి. శరీరానికి వ్యాయామం చాలా అవసరం. వ్యాయామం చేసే సమయం లేదనుకునే వాళ్లు కనీసం ఫోన్ మాట్లాడేటప్పుడు అయినా.. అటు ఇటు నడుస్తూ మాట్లాడటం వల్ల కాస్తయినా శరీరంలోని కొవ్వు కరిగే అవకాశం ఉంటుంది. గంటల కొద్ది సమయంలో కుర్చీల్లో కూర్చొని పనులు చేయకుండా అరగంటకు ఒకసారైనా లేచి పది అడుగులు వేయాలి.

లిఫ్ట్, ఎస్కలేటర్ వంటి వాటికి దూరంగా ఉంటూ మెట్లకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇలా చేయడం కూడా వ్యాయామం కిందకు వస్తుంది. ఆల్కహాల్ కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఉదయాన్నే పరగడపున రోజూ వేడి నీటిని తాగితే ఫలితం త్వరగా కనపడుతుంది. ఈ టిప్స్ అన్నింటినీ ఫాలో అయితే.. కచ్చితంగా బరువుతగ్గుతారు. కనీసం ఒక్కరోజు దీనిని ఫాలో అయినా.. ఒక కేజీ బరువు తగ్గే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.