వంటింటి ఫేస్ మాస్క్ తో... చర్మ నిగారింపు

అందంగా ఉండాలని.. అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందుకోసం మార్కెట్లో లభించే వివిధ రకాల మాస్క్ లు, క్రీములు వగైరా వగైరా ఉపయోగిస్తూ ఉంటారు. 

Natural Homemade Face Packs For Instant Glow

 అందంగా ఉండాలని.. అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందుకోసం మార్కెట్లో లభించే వివిధ రకాల మాస్క్ లు, క్రీములు వగైరా వగైరా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే... పెద్దగా కష్టపడకుండా... ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టకుండా... ముఖారవిందాన్ని పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

అయితే... అందరికీ ఒకే రకం మాస్క్ సూట్ అవ్వదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చర్మం తీరును బట్టి ఫేస్ మాస్క్ మార్చుకోవాలని చెబుతున్నారు.

జిడ్డు చర్మం గల వారు... నాలుగు టేబుల్ స్పూన్ల సెనగపిండి, టీ స్పూన్ నిమ్మరసం, కొద్దిగా పెరుగు, చిటికెడు పసుపు తీసుకొని అన్నీ కలిపి పేస్టులాగా తయారు చేయాలి. అనంతరం ఈ మిశ్రాన్ని ముఖానికి, మెడకు రాయాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం కడిగేసుకుంటే... ముఖం మీద టాన్ తొలగిపోయి...  సహజత్వం ఉట్టిపడుతుంది. అంతేకాకుండా చర్మం మెరుస్తుంది.

బ్లాక్ హెడ్స్ పోవాలని అనుకునేవారు... బాగా మగ్గిన అరటిపండులో సగం తీసుకొని, మెత్తగా చేసుకోవాలి. దీనిలో రెండు టేబుల్‌ స్పూన్ల ఓట్స్‌, టీ స్పూను తేనె వేసి, కలపాలి. ఈ ప్యాక్‌ను ముఖానికి రాసుకొని ఇరవై నిమిషాల తర్వాత వేడి నీళ్లతో కడిగేయాలి. దీంతో దెబ్బతిన్న చర్మ కణాలు మెరుగపడతాయి. చర్మానికి అవసరమైన విటమిన్లు లభిస్తాయి.

బ్లీచ్‌ ప్యాక్‌: సమపాళ్లలో యోగర్ట్‌, టొమాటో రసం తీసుకొని చక్కగా మిక్స్‌ చేయాలి. ముఖం, మెడ భాగంలో ఈ ప్యాక్‌ను పట్టించి, 30 నిమిషాల తర్వాత వేడినీళ్లతో శుభ్రం చేసుకోవాలి. మెరుగైన ఫలితం కోసం రెండు రోజులకు ఒకసారి ఈ మిశ్రమాన్ని అప్లై చేయాలి. ఇలాచేస్తే ఎర్రటి మచ్చలు తగ్గిపోతాయి.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios