Life After Death: ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత తిరిగి అతను జన్మిస్తాడంటే మీరు నమ్ముతారు. హా .. ఖచ్చితంగా ఇలాంటి విషయాలను నమ్మేవారుచాలా మందే ఉన్నారు. కొంతమంది జన్ముండదు పాడు ఉండదంటే .. కొంతమంది మాత్రం ఆ వ్యక్తి ఏదో ఒక రూపంలో మళ్లీ జన్మిస్తాడని వాదిస్తుంటారు.
Life After Death:పుట్టిన ప్రతి వ్యక్తికి మరణం తథ్యం. మరణం లేకుండా ఈ భూమిపై ఏ జీవి ఉండదు. ఒక వ్యక్తి ఎన్ని ఏండ్లైనా బతకని కానీ అతనికి ఏదో ఒకనాడు ఏదో కారణం చేత మరణం సంభవించడం పక్కాగా జరుగుతుంది. అందుకే ఉన్నంత కాలం సంతోషంగా, అందరితో నవ్వుతూ బతుకుతూ ఉండాలని పెద్దలు చెబుతూ ఉంటారు. ఇక ఈ సంగతి పక్కక పెడితే చాలా మంది పునర్జన్మను నమ్ముతుంటారు. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతను ఖచ్చితంగా మళ్లీ ఏదో ఒక రూపంలో పుడతాడని విశ్వసిస్తారు.
ముఖ్యంగా ఒక వ్యక్తి చనిపోతే.. కేవలం అతని శరీరం మాత్రమే చనిపోయింది. అతని ఆత్మ మాత్రం చావలేదని, అది మన చుట్టూనే తిరుగుతుందని విశ్వసిస్తారు. అంతేకాదు ఆత్మకు చావు లేదని నమ్ముతుంటారు. ఈ ఆత్మ ఇష్టమైన వారి చుట్టూ తిరుగుతుందని భావిస్తుంటారు. ఇకపోతే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత పునర్జన్మ పొందుతాడనే విషయంపై సైన్సు ఏం చెబుతుంది? నిజంగా ఒక వ్యక్తి చనిపోయి ఆత్మగా మారతాడా? అతను మరో జన్మ ఎత్తుతాడా? అనే విషయంలో అనేక పరిశోధనలు చేశారు. మరి ఈ విషయాలపై అధ్యయనాలు ఏం చెబుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం...
సీన్ కారోల్ అనే వ్యక్తి Institute of Technology లో ఫిజిక్స్ ప్రొఫెసర్ , కాస్మోలజిస్ట్ గా విధులు నిర్వహిస్తున్నారు. చనిపోయిన తర్వాత మరో జన్మ ఉంటుందా? లేదా? అనే విషయంపై ఈయన ఎన్నో పరిశోధనలు జరిపారు. కాగా ఈయన యూకేలోని ఓ ప్రముఖ సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. దానిలో మరణానంతరం జీవితం ఉంటుందా లేదా అనే విషయంపై ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. చనిపోయిన తర్వాత పునర్జన్మ ఉంటుందనేది పూర్తిగా అవాస్తవమని ఆయన పేర్కొన్నాడు. సైన్స్ ఎన్నో అద్బుత విషయాలను తెలుసుకున్నది. కానీ చనిపోయిన తర్వాత మరో జన్మ ఉంటుందనేది సైన్స్ చెప్పడం లేదు. ఈ భూమిపై మనం జీవించి ఉన్నంత కాలమే మనకు బతుకు ఉంటుదన్న వాస్తవాన్ని అందరూ గ్రహించాలని సీన్ కారోల్ పేర్కొంటున్నారు.
చనిపోయిన తర్వాత కూడా మరో జీవితం పొందాలంటే మన Physical body నుంచి consciousness ను వేరు చేయాలని ఆయన అన్నారు. ఇది అసాధ్యం. కాబట్టి చావు తర్వాత మరో జీవితం ఉంటుందనే వాదన పూర్తిగా అవాస్తవమని ఆయన వెళ్లడిస్తున్నారు. అయినా ఈ ఆధునిక కాలంలో కూడా మూఢనమ్మకాలను నమ్మడం పూర్తిగా మన వెర్రితనమే అవుతుంది.
