పావురాల బెడదతో విసిగిపోయారా? బాల్కనీలో వాటి గోల, అపరిశుభ్రతతో ఇబ్బంది పడుతున్నారా? చింతించకండి! కొన్ని సులభమైన చిట్కాలతో మీ ఇంటిని పావురం లేని ప్రదేశంగా మార్చుకోవచ్చు.
నగరవాసులకు పావురాల బెడద కొత్తేమీ కాదు. ముఖ్యంగా బాల్కనీలు, విండోల దగ్గర వాటి గోల, అపరిశుభ్రత చాలా ఇబ్బంది కలిగిస్తుంది. కొన్ని సులభమైన చిట్కాలతో మీ ఇంటిని పావురం లేని ప్రదేశంగా మార్చుకోవచ్చు. పావురాలను బాల్కనీ నుండి దూరంగా ఉంచడం అంత కష్టం కాదు, కొన్ని తెలివైన చిట్కాలు పాటిస్తే చాలు.
1. అల్యూమినియం ఫాయిల్ లేదా CDలు వేలాడదీయండి
పావురాలు ప్రకాశవంతమైన వస్తువులకు భయపడతాయి. బాల్కనీలో CDలు లేదా అల్యూమినియం ఫాయిల్ ముక్కలు వేలాడదీయండి. సూర్యకాంతి పడి ప్రతిబింబిస్తే పావురాలు దగ్గరికి రావు.
2. స్పైక్స్ లేదా వైర్లు అమర్చండి
బాల్కనీ రెయిలింగ్ లేదా AC యూనిట్లపై పావురాలు తరచుగా వాలతాయి. అక్కడ స్పైక్స్ లేదా వైర్లు అమర్చడం వల్ల అవి కూర్చోలేవు.

3. ఘాటైన వాసనలు వెదజల్లండి
పావురాలకు ఘాటైన వాసనలు నచ్చవు. వేప నూనె, లావెండర్, పుదీనా లేదా యూకలిప్టస్ నూనెను నీటిలో కలిపి స్ప్రే చేయండి. ఇది ఆరోగ్యానికి కూడా సురక్షితం.
4. వలలు కట్టండి
పావురాలు లోపలికి రాకుండా వలలు కట్టండి. ఇవి పారదర్శకంగా ఉంటాయి కాబట్టి బాల్కనీ అందం చెడదు. పిల్లలు, పెంపుడు జంతువులకు కూడా సురక్షితం.
5. నకిలీ గుడ్లగూబ లేదా రిఫ్లెక్టివ్ టేప్
నకిలీ గుడ్లగూబ లేదా ఇతర పక్షి బొమ్మలు పావురాలను భయపెడతాయి. వీటిని బాల్కనీలో ఎత్తైన ప్రదేశంలో ఉంచండి. రిఫ్లెక్టివ్ టేప్ కూడా చవకైన పరిష్కారం.
