పిల్లల్ని అతిగా పొగుడుతున్నారా? అది ఎంత ప్రమాదమో తెలుసా?

పిల్లలు ఏది చేసినా తల్లిదండ్రులకు అదో ఆనందమే. అందులోనూ పిల్లలు చిన్న పని చేసినా.. వారిని ఆశాకాశానికి ఎత్తేస్తూ.. వారిని తెగ పొగిడేస్తూ ఉంటారు. ఇలా చేయడం వారికి సంతోషాన్నిస్తుంది కదా అని అనుకుంటే పొరపాటే. పిల్లలను అతిగా పొగిడితే ఎన్నో సమస్యలను ఎదుర్కోకతప్పదు. ముఖ్యంగా మీ పిల్లలు అభివృద్ధి ఆగిపోతుంది. 
 

do not praise children too much it adversely affect their development

పిల్లలు ఏది చేసినా తల్లిదండ్రులకు అదో ఆనందమే. అందులోనూ పిల్లలు చిన్న పని చేసినా.. వారిని ఆశాకాశానికి ఎత్తేస్తూ.. వారిని తెగ పొగిడేస్తూ ఉంటారు. ఇలా చేయడం వారికి సంతోషాన్నిస్తుంది కదా అని అనుకుంటే పొరపాటే. పిల్లలను అతిగా పొగిడితే ఎన్నో సమస్యలను ఎదుర్కోకతప్పదు. ముఖ్యంగా మీ పిల్లలు అభివృద్ధి ఆగిపోతుంది. 

పిల్లలు ఏది చేసినా ఆనందమే. వారు ఎలా ఉన్నా ముద్దే . అందుకే తల్లిదండ్రులు పిల్లలను అతి గారాభం చేస్తుంటారు. అంతేకాదు వారు చిన్న పాటి విజయం సాధించారంటే చాలు.. వారిని తెగ ప్రశంసిస్తూ మెచ్చుకుంటూ ఉంటారు. ఇలాంటి ఘటనలు మనం నిత్యం చూస్తున్నవే. కానీ చిన్న చిన్న విషయాలకు కూడా పిల్లల్ని తెగ మెచ్చుకుంటే వారి బంగారు భవిష్యత్తుకు అడ్డుకట్ట వేసినట్టే . ప్రశంసిస్తే వారి భవిష్యత్తుకు ఎలా అడ్డువస్తామని మీరు కోపానికి రావొచ్చు గానీ.. ఇది మీరు నమ్మలేని నిజం. ఎందుకంటే అతి పొగడ్తలు పిల్లల్ని ప్రతికూల పరిస్థితులవైపు తీసుకెళ్తాయట. 

పిల్లలకు పొగడ్తలు బూస్టర్ లా పనిచేస్తాయనడం ఎంత నిజమో.. అతి పొగడ్తలు వారి అభివృద్ధి బీఠలు వారేలా చేస్తాయనే విషయం కూడా అంతే నిజం. పిల్లలు మంచి పని చేసినప్పడు పొగడండి. అలాగని కొంతమంది పిల్లలు విజయాన్ని సాధించినా.. ఇదేనా అంటూ వారి విజయాన్ని చిన్న విషయంగా భావిస్తారు. అలా చేయడం కూడా తప్పే. పిల్లలు చిన్న పాటి విజయం సాధించినా తల్లిదండ్రుల నుంచి మొదటగా ఆశించేది వారిని మెచ్చుకోవడమే. అందుకే వారిని అప్పుడప్పుడు పొగడండి. అంతేకాని చిన్నపాటి విషయాలకు కూడా వారిని నిత్యం పొగడ్తలతో మోస్తే మాత్రం వారి అభివృద్ధిని మీ చేతురాలా మీరే ఆపేసినవారవుతారు. అంతేకాదు అతిపొగడ్తలు వారిని ఎన్నో వేధింపులకు గురయ్యేలా చేస్తాయట. అంతేకాదు ఇది ప్రాణాంతంకంగా కూడా మారవచ్చట. 

అతిగా  ప్రశంసించడం వల్ల పిల్లలకు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోలేరట. ఇవన్నీ వాస్తవాలా అంటే.. నూటికి నూరు పాల్లు ఇవి అక్షర సత్యాలు.  ఈ విషయాలను బ్రిటన్ ఎక్సెటర్ విశ్వవిద్యాల శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. ఈ పరిశోధనలో దాదాపుగా 4,500 మంది పేరెంట్స్ పాలుగొన్నారు. 85 శాతం పేరెంట్స్ తమ పిల్లలను అతిగా పొగడటం వల్లే వారు నేర్చుకునే విధానంపై ప్రతికూల ప్రభావం పడిందని.. University Social Mobility Department Elliott Major ప్రకారం వెళ్లడైంది. 

వాస్తవానికి పిల్లలకు పొగడ్తలు ఎంతో అవసరం. పొగడ్తలు వారికి బూస్టర్ లా పనిచేస్తాయి. కానీ అతిగా పొగిడితే మాత్రం వారిపై ప్రతికూల ప్రభావం పడుతుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. పరిశోధన ప్రకారం.. పిల్లలతో సానుకూలంగా మాట్లాడినా.. లేదా వారిని మెచ్చుకున్నావారిలో శక్తి సామర్థ్యాలు రెట్టింపవుతాయట. కానీ ఇదే విషయమే వారి అభివృద్ధికి ఆటంకంలా కూడా మారుతుందని పేరెంట్స్ గుర్తించలేకపోతున్నారు. కాగా ఎంతో మంది గొప్పవారు తమతల్లిదండ్రుల ప్రోత్సాహం, ప్రశంసల వల్లే గొప్ప స్థానాన్ని చేరుకున్నవారున్నారు. అలా అని వారిని అతిగా పొగిడి.. వారిని జీవితంలో ఫెయిల్ అయ్యేలా చేయకండి. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios