సిక్స్ ప్యాక్ బాడీ కోసం రాత్రింభవళ్లు బాగా కష్టపడుతున్నారా? కండల కోసం కేవలం జిమ్ ఒక్కటే చేస్తే సరిపోదండి. బలమైన ఆహారం కూడా తీసుకోవాలి. అప్పుడే మీరు కోరుకునే శరీరాకృతి లభిస్తుంది. అలాగే ఫిట్ గా కూడా ఉండగలగుతారు.

Bodybuilding Tips: ప్రస్తుతం చాలా మంది అబ్బాయిలు సిక్స్ ప్యాక్ బాడీ కోసం తెగ కష్టపడుతున్నారు. సమయాన్ని మర్చిపోయి జిమ్ సెంటర్లలోనూ, పార్కుల చుట్టే తిరుగుతున్నారు. ఇలా చేయడం వల్ల శరీరాకృతి మారడమే కాదు.. ఫిట్ గా కూడా ఉంటారు. హ్యాండ్ సమ్ గా కూడా మారతారు. అయితే కండల కోసం కేవలం జిమ్ లు, ఎక్సర్ సైజెస్ చేస్తేనే సరిపోదు.. దానికితగ్గట్టు బలమైన ఆహారం కూడా తీసుకోవాలంటున్నారు ఫిట్ నెస్ ట్రైనర్లు.

 మీ బాడీ సిక్స్ ప్యాక్ తో ప్యాక్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా ప్రోటీన్లు, విటమిన్లు ఎక్కువగా లభించే ఫుడ్ ను తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రకమైన ఫుడ్ మీరు బలంగా కండల వీరుడిగా చేసేందుకు ఎంతో సహాయపడుతుంది. కాబట్టి కండలను పెంచే ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఎలాంటి ఆహారం తీసుకుంటే కండలు పెరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

గుడ్లు: గుడ్డు మంచి పోషకాహారం. ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే వీటిని మీరు వ్యాయామం చేసిన తర్వాత తీసుకోవాలి. దీనివల్ల మీ కండరాలు పెరుగుతాయి. అయితే చాలా మంది పచ్చసొన గుండెకు మంచిది కాదని దానిని తినరు. కానీ గుడ్డు పూర్తిగా హై ప్రోటీన్ తో నిండి ఉంటుంది. సో అటువంటి అపోహలు పెట్టుకోకుండా గుడ్డును తినండి. ఒక్క గుడ్డుతో మీకు 6 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. 

చికెన్ బ్రెస్ట్ లు: కండరాల పెరుగుదలకు ప్రోటీన్ ఫుడ్ ఎంతో అవసరం. కాగా చికెన్ బ్రెస్ట్ లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు వీటిలో సెలీనియం కూడా మెండుగా లభిస్తుంది. ఇవి ఫ్రీ రాడికల్స్ దెబ్బతినకుండా చేస్తాయి. 

క్వినోవా: సిరి ధాన్యాలతో తయారయ్యేదే క్వినోవా. ఇది మంచి శాఖాహారం. దీనివల్ల మన శరీరానికి కావాల్సిన ఎన్నో ప్రోటీన్లు లభిస్తాయి. అంతేకాదు వీటిలో అమైనో ఆమ్లాలు కూడా మెండుగా ఉంటాయి. ఇవి కండర నిర్మాణం కోసం ఎంతో సహాయపడతాయి. ఈ క్వినోవాను చికెత్ తో లేదా కూరగాయలతో తిన్నా మంచి ఫలితం ఉంటుంది.

పప్పులు: పప్పులు లేని ఇల్లు ఉండదు. ఇవి మన బాడీకి ఎంతో అవసరం. ఎందుకంటే ఈ పప్పుల్లో ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా కొవ్వు శాతం చాలా తక్కువగా ఉంటుంది. అందులోనూ ఈ పప్పులు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. పప్పులతో బ్రౌన్ రైస్ తింటే మేలు. 

వాల్ నట్స్: అల్పాహారం కండరాల పెరుగుదలకు ఎంతో సహాయపడుతుంది. అంతేకాదు ఇవి మీ ఆకలిని ఇట్టే దూరం చేస్తుందట. అందుకే మార్నింగ్ పూట వాల్ నట్స్ ను , తృణ ధాన్యాలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటిని తింటే కండరాలు పెరుగుతాయి. అలాగే ఆరోగ్యం కూడా బాగుంటుందని ఫిట్నెస్ ట్రైనర్లు చెబుతున్నారు.